కోటి దాటిన ‘గీత’ రేటు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine rashmika
Updated:  2018-09-04 06:52:23

కోటి దాటిన ‘గీత’ రేటు

“ఛలో” తో తెలుగునాట అడుగిడిన కన్నడ బ్యూటీ రష్మీక మందన్న ఇప్పుడు “గీత గోవిందం” హిట్ తో గోల్డెన్ గర్ల్ గా సెటిల్ అయిపోయింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నాగార్జున-నాని మల్టీస్టారర్ మూవీ ‘దేవదాస్’లో నటిస్తోంది. ఈ చిత్రంకూడా హిట్ అయితే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లీగ్ లోకి చేరిపోతుంది ఈ కన్నడ కుట్టి.

అయితే ఇంకా పారితోషకం విషయంలో ఆ స్టార్ రేంజ్ కి చేరుకోలేదులే అనుకునే లోపే నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది ఈ పాప. తెలుగులో చేసిన రెండు సినిమాలూ ఘన విజయం సాధించడంతో.. రష్మిక రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తోందని ఫిలింనగర్ టాక్. మినిమం కోటి ఇస్తేగాని డేట్స్ కుదరవు అంటూ ఇచ్చినవారికి మాత్రమే తన కాల్షీట్స్ అని ఖరకండిగా చెప్పేస్తుందంటా! దీంతో కొందరు నిర్మాతలు వేరే హీరోయిన్ చూసుకుంటుంటే.. పెద్ద నిర్మాతలు మాత్రం అడిగినంత ఇచ్చి డేట్స్ తీసుకుంటున్నారట.

ఈ పాప ఇప్పటి చేసింది ఐదు చిత్రాలే అయినా క్రేజ్ మాత్రం చాలానే వచ్చేసింది.దానికి కారణం తీసిన ఐదు సినిమాలు సూపర్ హిట్లు కావడమే. ఇక ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ హిట్ తో రష్మికపై బాలీవుడ్ చూపు కూడా పడిందని వినికిడి. బాలీవుడ్ నుండి ఇప్పటికే ఆఫర్లు కూడా వచ్చాయని తెలుస్తోంది. వయసులో ఉన్నప్పుడు మాత్రమే హీరోయిన్లు సంపాదించగలరు అందుకే.. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని పక్కా ప్లానింగ్ తో ఉంటారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.