అదంతా రష్మీక కు వెన్నతో పెట్టిన విద్య లాంటిదట...

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

rashmika
Updated:  2018-10-16 05:52:51

అదంతా రష్మీక కు వెన్నతో పెట్టిన విద్య లాంటిదట...

మొట్టమొదటి సినిమా ఛలో సినిమాతోనే కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పుట్టించిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న రెండవ సినిమా అయిన గీతగోవిందం తో బ్లాక్ బస్టర్ ను అందుకుంది. ఇక ఈ మధ్యనే దేవదాసు సినిమాలో ఇన్స్పెక్టర్ పూజా గా కనిపించి మనల్ని మెప్పించిన రష్మిక మందన్న చేతుల్లో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి.

గీత గోవిందం స్టార్ విజయ్ దేవరకొండ తో డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్న రష్మిక నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమాకు సైన్ చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు కొత్త విషయాలు నేర్చుకోవటం, అలాగే కొత్త వ్యక్తులతో కలిసి పోవటం ఇలాంటివి వెన్నతో పెట్టిన విద్యని చెప్పుకొస్తోంది.ఎలాంటి వాతావరణంలో అయినా తాను చాలా త్వరగా అలవాటు పడిపోగలనని, అందుకే తనకు ఏ భాష సినిమాల్లో నటించడం కష్టం గా మారలేదని చెబుతోంది.

అంతేకాక తను సినిమాల్లోకి డబ్బు సంపాదించాలన్న కోరిక తో రాలేదని, కేవలం తనని తాను మంచి పాత్రల్లో చూసుకోవాలనే ఇష్టం తో వచ్చాను అని చెబుతోంది. తను ఒప్పుకున్న సినిమా లో తన పాత్ర కు తగ్గట్టుగా తాను నేర్చుకోవాల్సిన అంశాలపై దృష్టి పెడతానని చెబుతున్న రష్మీక సినిమా కోసం క్రికెట్ నేర్చుకున్నట్టు చెప్పింది. అది ఏదైనా చాలా త్వరగా నేర్చుకోవటంలో తను అందరికంటే ముందు ఉంటా అని కూడా చెబుతోంది.

షేర్ :