రెండు హిట్స్ తోనే ర‌ష్మిక కి పొగ‌రు ఎక్కేసిందా..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine
Updated:  2018-08-22 11:53:17

రెండు హిట్స్ తోనే ర‌ష్మిక కి పొగ‌రు ఎక్కేసిందా..?

"ఛలో" అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది రష్మిక. కన్నడ లో నటించ "కిరిక్ పార్టీ" సినిమాతో ఒక రేంజ్ లో క్రేజ్ సంపాదించింది ఈ భామ. ఇక తెలుగు లో కూడా నటించిన మొదటి సినిమా హిట్ అవ్వడం తో తెలుగు లో వరుసగా అవకాశాలు సంపాదించింది ఈ భామ.

ఇటివలే విజయ్ దేవరకొండ తో కలిసి "గీత గోవిందం" అనే సినిమాలో నటించి మంచి హిట్ ని అందుకుంది ఈ భామ. ఇక రెండు సినిమాల హిట్ తో రష్మిక కి తెలుగు ఇంకా ఎక్కువ ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం "దేవాదాసు" "డియర్ కామ్రేడ్" వంటి మూవీస్ రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక తనకి ఆఫర్స్ వస్తుండడం తో రష్మిక తన రెన్యుమరేషన్ ని పెంచేసింది అంట. ఇప్పుడు తాను ఒక్క సినిమాకి రూ. 50 లక్షల నుంచి 60 లక్షల దాక డిమాండ్ చేస్తుంది అంట భామ. కానీ కొంత మంది నిర్మాతలు మాత్రం రెండు సినిమాలకే ఈ రేంజ్ లో డబ్బులు డిమాండ్ చేస్తే దాన్ని పొగరు కాకే ఇంకేం అంటారు అని వాబోతున్నారు. ఇదిలా ఉంటే రష్మిక ప్రస్తుతం కన్నడ సినిమాలు ఏవి ఒప్పుకోవట్లేదు. 

షేర్ :