ర‌వితేజకు కిక్ ఇవ్వ‌నున్న వ‌క్కంతం వంశీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

ravi teja and vakkantham vamsi
Updated:  2018-07-02 12:38:06

ర‌వితేజకు కిక్ ఇవ్వ‌నున్న వ‌క్కంతం వంశీ

సినిమా ఇండ‌స్ట్రీలో 24 క్రాఫ్ట్స్ పై కాస్త ప‌ట్టు ఉంటే తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్నత‌స్దితికి చేరుకోవ‌చ్చు... ఇక పూర్తి ప‌ట్టు ఉన్న‌వారు అగ్ర‌ద‌ర్శ‌క నిర్మాత‌లుగా మార‌తారు... ర‌చ‌యిత‌లు ద‌ర్శ‌కులుగా మార‌తారు.. అవును అది తెలిసిందే..
 
ఇక ద‌ర్శ‌కుడు అంటే ర‌చ‌యిత‌గానే వ‌స్తారు ఇది వాస్త‌వం.. మ‌రి టాలీవుడ్ లో ఇటీవ‌ల అంద‌రికి కాస్త ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ర‌చ‌యిత  కం ద‌ర్శ‌కుడు అంటే వెంట‌నే వినిపించే పేరు వక్కంతం వంశీ.. అయితే ఆయ‌న కంటే ముందు మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ - కొరటాల శివ ఉన్నారు... కాని ఈ దశాబ్ద‌పు హిట్ సినిమాల్లో ర‌చ‌యితలుగా వ‌చ్చి మెగాఫోన్ ప‌ట్టుకున్న‌వారు వీరు ముగ్గురు అని చెప్పాలి.
 
 
ఇటు వ‌క్కంతం వంశీ ఇటీవ‌ల ద‌ర్శ‌క‌త్వంలోకి అడుగుపెట్టి అల్లు అర్జున్ తో నాపేరు సూర్య నాఇళ్లు ఇండియా సినిమా తెర‌కెక్కించారు..ఇటు క‌థ న‌చ్చ‌డం ద‌ర్శ‌కుడిగా తాను చేస్తాను అన‌డంతో ఇటు అల్లు అర్జున్ కూడా ఒకే చేశాడు.. విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకోవ‌డంలో ఇటు అల్లు వారి అబ్బాయి స్టైలిష్ స్టార్ అర్జున్  కూడా ఆలోచిస్తూ ఉంటాడు క‌దా అదీ తెలిసిందే.
 
ఇక ఇప్పుడు ఈ సినిమా అనుకున్నంత హైప్ తెచ్చుకోలేక‌పోయింది ...ముఖ్యంగా అల్లు అర్జున్ కు హిట్ అయినా ఆయ‌న స్దాయికి మాత్రం హిట్ గా అందుకోలేక‌పోయింది.. ఇక వంశీ స్టైలిష్ స్టార్ తో సినిమా అన‌గానే అంద‌రూ క్యూక‌ట్టారు.. త‌ర్వాత సినిమా మాతో క‌మిట్మెంట్ ఇవ్వాలి అని అడిగారు..  అయితే ఇప్పుడు వారు  ఎవ‌రూ  క‌నిపించ‌డం లేద‌ట‌. 
 
ముందుకు వ‌చ్చిన హీరోలు కూడా వెన‌క్కి వెళ్లారు అని తెలుస్తోంది. ఈ స‌మ‌యంలో గ‌తంలో ర‌వితేజ‌కు మంచి హిట్ ఇచ్చి కిక్ తో ఓ రేంజ్ హైప్ మాస్ మ‌హారాజాకు తీసుకువ‌చ్చాడు ర‌చ‌యిత వంశీ...ఇప్పుడు ఆయ‌న‌కు ఓ క‌థ చెప్ప‌డం దానికి ర‌వితేజ ఒకే చెప్ప‌డంతో వంశీకి కొత్త సినిమా క్లియ‌ర్ అయింద‌ని,  ఇది కూడా కిక్ లా మంచి హిట్ అవుతుంది అని ఆనందంలో ఉన్నార‌ట వంశీ... మ‌రి చూడాలి వంశీ ర‌వితేజ కాంబో ఎలా ఉండ‌బోతోందో.. ఈసినిమా పట్టాలెప్పుడు ఎక్కుతుందో.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.