అభిమానుల‌కు ర‌వితేజ ఈ సారి కొత్త స‌ర్ ప్రైజ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero ravi teja
Updated:  2018-06-28 02:55:48

అభిమానుల‌కు ర‌వితేజ ఈ సారి కొత్త స‌ర్ ప్రైజ్

మాస్ మ‌హారాజా ర‌వితేజ తెలుగు ఇండ‌స్ట్రీలో ఎన్నో ఇబ్బందులు ప‌డి పైకి వ‌చ్చాడు... తొలినాళ్ల‌లో చిన్న చిన్న‌క్యారెక్ట‌ర్లు చేసిన మాస్ మ‌హారాజా, త‌ర్వాత హీరోగా మంచి పాత్ర‌లు చేస్తూ పైకి ఎదిగాడు.. త‌న అభిరుచికి త‌గిన పాత్ర‌ల కోస‌మే కాకుండా ఎటువంటి సినిమాలు వ‌చ్చినా చేసి పెద్ద హీరోల‌కు త‌మ్ముడి పాత్ర‌లు, సైడ్ క్యారెక్ట‌ర్లు కూడా చేశాడు ర‌వితేజ‌.. ఇక కామెడీ టైమింగ్ పంచ్ లు వేయ‌డం గోదావ‌రి యాసను త‌న ప్రాస‌తో ప‌ల‌క‌రించ‌డంలో ఈ రాజుగారి స్టైలేవేరు..
 
ఇటు ఐదు ప‌దుల వ‌య‌సు వ‌చ్చినా యంగ్ లుక్ లో క‌నిపిస్తున్నాడు మాస్ మ‌హారాజా.. ఇక ఆయ‌న సినిమాలు ప్లాప్ లు హిట్లు వ‌చ్చినా లెక్క చేయ‌కుండా  ఏడాదికి రెండు సినిమాల‌తో త‌న జోరు పెంచుతున్నాడు.. ఇక ఇటీవ‌ల త‌నకు నేల‌టిక్కెట్టు అంత‌కు ముందు విడుద‌లైన ట‌చ్ చేసి చూడు సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.
 
అయితే మాస్ ఎలిమెంట్స్ ఉండే సినిమాలు చేయాలి అని భావించిన ర‌వితేజ, ఇప్పుడు త‌న మాస్ స్టైల్ నుంచి స‌రికొత్త, లుక్ తో క‌నువిందు చేయ‌నున్నాడ‌ట‌.. త‌దుప‌రి త‌న ప్రాజెక్టు ఇప్ప‌టి సినిమాల‌లా కాకుండా కొత్త‌గా డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. ఎక్కడకు పోతావు చిన్నవాడా ఫేమ్ డైరెక్టర్ వి.ఐ. ఆనంద్  ఈ సినిమాని తెర‌కెక్కించ‌నున్నారు. ఈ సినిమాలో తండ్రి కొడుకు పాత్ర‌లు చేయ‌నున్నాడు మాస్ మ‌హారాజా .. ఇందులో మ‌రింత యంగ్ బాయ్ లా క‌నిపించ‌నున్నాడు.
 
అయితే రెండు పాత్ర‌లు చేసిన కిక్ - విక్ర‌మార్కుడు సినిమాలు అత‌నికి ఎంత పెద్ద హిట్ అందించాయో ఈ చిత్రం కూడా అలాగే హిట్ టాక్ తెచ్చుకుంటుంది అని భావిస్తున్నాడు..అమర్ అక్బర్ ఆంటోని చిత్ర షూటింగ్ ముగిసిన త‌ర్వాత నెల రోజులు గ్యాప్ తీసుకుని ఈ సినిమా ప్రారంభిస్తార‌ట ర‌వితేజ‌.. ఇటు శ్రీనువైట్ ఈ సినిమా పై ఎన్నో అంచనాలు ఆశ‌లు పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.