త్రివిక్ర‌మ్ కు సీమ వాసులు స‌వాల్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

rayalaseema leaders
Updated:  2018-10-16 12:02:55

త్రివిక్ర‌మ్ కు సీమ వాసులు స‌వాల్

బాక్సాఫీస్ ముందు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్నచిత్రం అర‌వింద‌స‌మేత వీర‌రాఘ‌వేంధ్ర. ఈ సినిమా డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కు రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌జ‌లు తాజాగా స‌వాల్ విసిరారు. ఎప్పుడో ఒక గ్రామానికి రెండు కుటుంబాల‌కు ప‌రిమితం అయిన గొడ‌వ‌ల‌ను చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ డైరెక్ట‌ర్లు కాసుల‌కోసం క‌క్రుతి ప‌డి త‌మ రాయ‌ల‌సీమ సంప్ర‌దాయాన్ని నాస‌నం చేస్తున్నార‌ని రాయ‌ల‌సీమ వాసులు మండిపడ్డారు. 
 
సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి రాయ‌ల‌సీమ‌ను క‌రువు అనే మ‌హ‌మ్మారి రైతుల‌ను వెంటాడుతున్నా సీమ ప్రాంతాల‌కు ఎవ‌రైన వ‌స్తే తాము వారికి మ‌ర్యాద‌చేసి పంపుతామ‌ని మ‌ర్య‌ద‌కు మారు పేరు సీమ అని అలాంటి ప్రాంతాన్ని చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన త్రివిక్ర‌మ్ కించ‌ప‌రిచేలా సినిమాను తీయ‌టం దారుణం అని మండిప‌డ్డారు. ఎక్క‌డో డైరెక్ట‌ర్లు అంద‌రు త‌మ మొబైల్ ఫోన్ల‌ను స్విచ్ ఆఫ్ చేసుకుని క‌థ‌ను త‌యారు చేసుకుకోవ‌డం కాద‌ని త‌మ ప్రాంతానికి వ‌చ్చి సీమ ప్ర‌జ‌లు ప‌డుతున్న క‌ష్టాల‌ను చిత్రీకరించాల‌ని వారు డిమాండ్ చేశారు.
 
తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత రాయ‌ల‌సీమకు అన్యాయం జ‌రిగిందని  ఈ అన్యాయంపై త్రివిక్ర‌మ్ సినిమా తీయాల‌ని అన్నారు. రాయ‌ల‌సీమకు రావాల్సిన  హ‌క్కుల‌కోసం తాము పోరాటం చేస్తుంటే చిత్ర‌పరిశ్ర‌మ‌కు చెందిన వారు సీమ ఫ్యాక్ష‌న్ అని అక్క‌డి ప్ర‌జ‌లు కొట్టుకుచ‌స్తార‌ని చిత్రించ‌డం దారుణం అని మండిప‌డ్డారు. ఎంద‌రో మ‌హానుభావులు పుట్టిన గ‌డ్డ‌మీద సినిమా అనే మ‌హ‌మ్మారి సీమ సంప్ర‌దాయాల‌కు వ్య‌తిరేకంగా చిత్రిస్తే ఊరుకునేది లేద‌ని రానున్న రోజుల్లో వారికి త‌గిన బుద్ది చెబుతామ‌ని సీమ కృష్ట హెచ్చ‌రించారు.
 
రాయ‌ల‌సీమ గురించి సినిమాలు తీయాలంటే దేశంలో ఎక్క‌డా లేని చ‌రిత్ర త‌మ ప్రాంతంలో ఉంద‌ని మొద‌టిసారిగా స్వాతంత్య్ర ఉద్యమం సీమ‌లోనే స్టార్ అయింద‌ని ఎంద‌రో మ‌హాను బావుల‌గురించి సినిమాలు తీయాల‌ని సీమ‌వాసులు డిమాండ్ చేశారు. ఒక వేళ వారికి క‌థ తెలియ‌క‌పోతే విధ్యార్థి సంఘాల నాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ను రాయ‌ల‌సీమ‌కు వ‌స్తే ఆయ‌న‌కు మ‌ర్యాద‌లు చేసి సీమ చ‌రిత్ర‌గురించి వివ‌రిస్తామ‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment