అనుష్క ని ఈ కారణం తోనే ఎవరు సినిమాలోకి తీసుకోవట్లేదా..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

anushka shetty
Updated:  2018-10-04 05:02:32

అనుష్క ని ఈ కారణం తోనే ఎవరు సినిమాలోకి తీసుకోవట్లేదా..?

అనుష్క శెట్టి అసలు ఒకానొక సమయంలో డేట్స్ ఖాళి లేకుండా బిజీగా గడిపిన అగ్ర నటి.. కానీ ఈ మధ్య ఏంటో ఒక్క సినిమా కూడా సైన్ చేయకపోవడం తో అందరికి వందలాది అనుమానాలున్నాయి. తను లాస్ట్ గా చేసిన సినిమా భాగమతి. ఆ తర్వాత స్వీటీ సినిమాలే రాలేదు.
 
నాగార్జున సూపర్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన అనుష్క దక్షిణాది లో భాషాభేధాలు లేకుండా అందరి అగ్ర కథానాయికగా పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. బహుబలి సినిమాలో కూడా ప్రధాన పాత్రలో దేవసేన గా మెప్పించింది. అంతకు ముందే అరుంధతీ సినిమాలో జేజెమ్మ గా, సైజ్ జీరో లో ఊబకాయం వచ్చిన అమ్మాయిలా, భాగమతి లో కొత్తగా లేడీ ఓరియెంటెడ్ రోల్స్ లో కూడా తనదైన ముద్ర వేసుకుంది అనుష్క శెట్టి. అయితే హీరో లతో సరిపడ స్టార్ డం ఉన్నా ఇప్పుడు ఏ సినిమాలు ఎందుకు చేయట్లేదు అని అందరి డౌట్... దానికి కారణము లేకపోలేదు. ఇప్పటికే స్వీటీ కి 36 ఏళ్ళు వచ్చేశాయి.
 
ఈ కారణంతో ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని స్వీటీ ని తొందరపెడుతున్నట్టు తెలుస్తుంది. ఈమధ్య ప్రభాస్ తో ఎఫైర్ ఉన్నట్టు వస్తున్న వార్తల్ని ఖండించిన అనుష్క, ఈ పెళ్లి కోసం వస్తున్న వార్తల్ని ఖండించకపోవడం చర్చనీయాంశంగా మారింది.మరొక వాదన కూడా లేకపోలేదు..  తన పర్సనాలిటీ యువహీరోలకు సూట్ కావడం లేదన్న కారణంగా కూడా సినిమాలు చేయట్లేదు అనే వార్త ఉంది.. కాజల్ - నయనతార లాంటి సీనియర్ నాయికలు యువహీరోలకు సూటవుతున్నా అనుష్క సెట్ కావడం లేదని అందుకే తన దగ్గరకి దర్శకులు కథలు తీస్కుని రావడం లేదని ఇంకో పుకారు ప్రచారంలో ఉంది.
 
ఇవి పుకార్లు అయితే పర్వాలేదు.. లేదంటే స్వీటీ రిటైర్మెంట్ తీసుకుందని అనుకోని, సెకండ్ ఇన్నింగ్స్ కోసం వేచి చూడాల్సిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.