బిగ్ బాస్ నుంచి పూజ అందుకే బయటకి వచ్చిందా ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

puja ramachandran
Updated:  2018-08-28 12:41:21

బిగ్ బాస్ నుంచి పూజ అందుకే బయటకి వచ్చిందా ?

తెలుగు బిగ్ బాస్ 2 షో లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది హాట్ హీరోయిన్ పూజ రామచంద్రన్. షో లోకి పూజ రాగానే చాలా గ్లామర్ వచ్చింది అని అందరూ అనుకున్నారు, కానీ ఈ గ్లామర్ భామ షో లో ఎంతో కాలం నిలువలేదు. వచ్చిన కొన్ని వారాలకే ఈ భామ ఎలిమినేట్ అయిపొయింది.
 
టు సినిమాల్లో కూడా వచ్చి వెళ్లిపోయే క్యారెక్టర్సే ఎక్కువగా దక్కుతుంటాయ్‌ పూజా రామచంద్రన్‌కి. పూర్తి స్థాయి హీరోయిన్‌గా కన్నా, సెకండ్‌ హీరోయిన్‌ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించింది పూజా రామచంద్రన్‌. బిగ్‌బాస్‌లో కూడా అలాగే వచ్చి వెళ్ళిపోయింది ఈ భామ.  
 
ఈ భామ హౌస్ లోకి ఎంటర్ అవ్వడమే టాస్క్‌లు ఇరగదీసేసింది. బిగినింగ్‌లో పూజా ఎనర్జీ చూసి, బిగ్‌బాస్‌ ఫైనల్‌లో గట్టి పోటీ ఇస్తుందని భావించారంతా. కానీ ప్రేక్షకుల తీర్పు మరోలా ఉంది. పూజాలో బిగినింగ్‌లో ఉన్న ఎనర్జీ రాను రాను తగ్గుతూ వచ్చింది. దాంతో ఆమెను ఎలిమినేట్‌ చేసేశారు ఆడియన్స్‌. రాఖీ పండగ ద్వారా హౌస్ లోకి ఎంటర్ అయిన నాని తనతోపాటే పూజని హౌస్ లో నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.