ఆ కుక్కతో పవన్ కి నాకు ప్రత్యేక అనుబంధం

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

pawan kalyan and renu desai
Updated:  2018-09-19 12:32:37

ఆ కుక్కతో పవన్ కి నాకు ప్రత్యేక అనుబంధం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “ఖుషి” సినిమా విజయానికి ప్రధాన కారణం అయన స్క్రీన్ ప్రెజన్స్ అయితే రెండవ కారణం ఆ చిత్ర సంగీతం. ఇప్పటికి ఆడువారి మాటలకూ అర్ధాలే వేరులే అనే సాంగ్ అందరికి విజువల్స్ తో సహా గుర్తుండే ఉంటుంది. ఆ చిత్రం లో పవన్ కళ్యాణ్ ఓ కుక్కతో కనిపిస్తారు. అది అయన సొంత పెంపుడు కుక్కే అని అప్పుడు అంతా అనుకున్నారు. అది నిజమే అంటూ తాజాగా అయన మాజీ భార్య రేణుక దేశాయ్ ఒక సామజిక మాధ్యమం ద్వారా తెలిపారు.

ఆమె వీలు చిక్కినప్పుడల్లా అలా పాత రోజులకు వెళ్లి వస్తుంటారు. అలాగే తనకి తన మాజీ భర్తకి ఎంతో ప్రీతీ పాత్రమైన భేల్ అనే పెంపుడు కుక్క గురించి ఒక పోస్ట్ చేశారు.ఆ శునకం న్యూజిలాండ్ కి చెందిన ఒక  జాతికి సంబదించిన కుక్క అని దాని ఆకారాన్ని చూసి అందరూ భయపడే వారని, అదంటే పవన్ కి చాలా ఇష్టమని అలాగే ఆ కుక్క తో తనకు ఒక ప్రత్యేక అనుబంధం ఉన్నదని ఆమె తన ఇస్టాగ్రమ్ పోస్ట్ లో చెప్పుకొచ్చింది.

ఖుషి చిత్రానికి ఆమె సహాయ దర్శకురాలిగా, సహాయ ప్రొడక్షన్ పర్సన్ గా సేవలందించారు. భేల్ రూపం చూసి అందరూ భయపడడం వాళ్ళ ఆ షూటింగ్ అయ్యేంత వరకు ఆ కుక్కని తానే దగ్గరుండి చూసుకునేదని, చూడ్డానికి ఆలా కనిపించినా ఆ శునకం చాలా మంచిదని ఆమె చెప్పుకొచ్చింది. తనతో చాల సరదాగా గడిపారని ఆనందకరమైన షూటింగ్ స్మృతులను ఆమె ఒక ఫోటో ద్వారా పంచుకున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.