ప‌వ‌న్ ర‌హ‌స్యాన్ని బ‌య‌ట పెట్టిన రేణూ దేశాయ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-07 18:54:12

ప‌వ‌న్ ర‌హ‌స్యాన్ని బ‌య‌ట పెట్టిన రేణూ దేశాయ్

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని నిత్యం ప‌వ‌న్ అభిమానులను విమ‌ర్శిస్తూ వారికి  సీరియ‌స్ వార్నింగ్ ఇస్తునే ఉంటారు. అయితే ఏనాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు వ్య‌తిరేకంగా పోస్ట్ చేయ‌లేదు. అలాగే గ‌తంలో ఎంందుకు ప‌వ‌ణ్ క‌ళ్యాణ్ తో విడాకులు తీసుకుందో ఇంత‌వ‌ర‌కూ ఎక్క‌డా వివ‌రించ లేదు. ఆయితే తాజాగా ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో విడాకుల విష‌యం ప్ర‌స్తావించారు.
 
గ‌తంలో కూడా ప‌వ‌ణ్ క‌ళ్యాణ్ తో ఎందుకు విడాకులు తీసుకోవాల‌నుకుంటున్నారో చెప్పాల‌ని స్ప‌ష్టం చేశారు. కానీ తాను ఎక్క‌డా చెప్ప‌లేద‌ని రేణూ తెలిపారు. ఇదే విష‌యాన్ని తాను ఇప్పుడు ఎవ‌రింటికి అయితే కోడ‌లుగా వెళ్తున్నానో వారు కూడా నన్ను అడిగార‌ని తాను చేసుకోబుతున్న‌ది అరేంజ్డ్ మేరేజ్ కనుక ఈ విష‌యానికి సంబంధించిన వివ‌రాల‌ను వివ‌రించాన‌ని చెప్పారు. జ‌రిగింది చెప్పిన త‌ర్వాత నీ తప్పులేనప్పుడు నిజం చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నార‌ని న‌న్ను ప్ర‌శ్నించార‌ని రేణూ అన్నారు. అందుకే తాను నిజ‌యం చెప్పాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చాన‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.
 
ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను నేను విడాకులు అడ‌గ‌లేద‌ని ఆవిష‌యం ఆయ‌న‌కు తెలుసు ఆ దేవుడికి తెలుస‌ని అన్నారు. ప‌వ‌న్ విడాకులు అడిగిన‌ప్పుడు త‌న‌కు కోపం వ‌చ్చింద‌ని అన్నారు. విడాకులు విష‌యంలో భార్యా భ‌ర్త‌లు ఏ విధంగా గొడ‌వ‌లాడుకుంటారో నేను కూడా ప‌వ‌ణ్ క‌ళ్యాణ్ తో గొడ‌వ‌ప‌డ్డాన‌ని తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.