రేణు దేశాయ్ ట్విట్ట‌ర్ అకౌంట్ క్లోజ్ ఎందుకో తెలుసా..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

renu desai twitter
Updated:  2018-06-26 18:45:13

రేణు దేశాయ్ ట్విట్ట‌ర్ అకౌంట్ క్లోజ్ ఎందుకో తెలుసా..?

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ప‌వ‌న్ ఫ్యాన్స్ కు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చి త‌న ట్వీట్ట‌ర్ ఖాతాను క్లోజ్ చేశారు. ఇంత‌కు ఏం జ‌రిగిందంటే..రేణు దేశాయ్ కొద్దిరోజుల క్రితం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు విడాకులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక త‌న జీవిత భాగ‌స్వామి కోసం తాను వివాహం చేసుకుంటున్నాన‌ని సోష‌ల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇటీవ‌లే నిశ్చితార్థం జ‌రిగింది. 
 
ఇక వీట‌న్నింటిపై ప‌వ‌న్ ఫ్యాన్స్ సీరియ‌స్ అయ్యారు. ఎట్టి ప‌రిస్థితిలో రెండ‌వ పెళ్లి చేసుకుంటే ఖ‌చ్చితంగా చంపేస్తామ‌ని ప‌వ‌న్  ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. ఇక ఈ విష‌యంపై రేణూ సీరియ‌స్‌ గా స్పందించి చివ‌రి ట్వీట్ చేసి, ట్విట్ట‌ర్ ఖాతాలో నుంచి వైదొలిగింది. రేణూ చివ‌రిగా ట్వీట్ ఏం చేసిందంటే, త‌న‌కు కొద్దిరోజుల నుంచి సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన నెగిటివిటీ నిండి ఉంద‌నిపిస్తోంద‌ని అక్క‌డ ఉండేవారు అధికంగా అజ్ఞాత వ్య‌క్తులు వ్య‌క్తి గ‌తంగా చికాకుపుట్టించే వారు ఉంటార‌ని విమ‌ర్శించారు.
 
renu desai tweet
 
ఇప్పుడున్న ప‌రిస్థితిలో రాజకీయ వ్యక్తుల గురించి కానీ, ఒక సినిమా గురించి కానీ నెగిటివ్ గా రాయ‌డానికి ఇష్ట‌ప‌డుతార‌ని తెలిపారు. తాను త్వ‌ర‌లో నూత‌న  జీవితాన్ని ప్రారంభించ‌బోతున్నాన‌ని ఈ స‌మ‌యంలో తాను ఒక నిర్ణ‌యం తీసుకున్నాన‌ని ట్వీట్ చేశారు. నేను నా ట్విట్టర్‌ ఖాతాను డియాక్టివేట్‌ చేసి, ఈ నెగిటివిటీకి దూరంగా ఉండదలుచు కున్నానని తెలిపారు. అయితే తాను ట్విట్ట‌ర్ ఖాతాను తొల‌గించినందుకు ప‌వ‌న్ అభిమానులు విమ‌ర్శ‌లు చేస్తే స‌హించేది లేద‌ని రేణు వార్నింగ్ ఇచ్చారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.