నా కుమారుడిని అలా అంటే ఉరుకోను ప‌వ‌న్ ఫ్యాన్స్ కు రేణూ వార్నింగ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-06-20 17:13:31

నా కుమారుడిని అలా అంటే ఉరుకోను ప‌వ‌న్ ఫ్యాన్స్ కు రేణూ వార్నింగ్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌పై రేణూ దేశాయ్ సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని విమ‌ర్శ‌లు చేశారు. త‌న కుమారుడు అకీరా నంద‌న్ ను ప‌వ‌న్ క‌ళ్యాన్ అభిమానులు జూనియ‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ అని పిల‌వ‌కండ‌ని రేణూ ఇన్ స్టాగ్రామ్ లో కోరింది. ఒక వేళ అలా పిలిచినవారి సోష‌ల్ మీడియా అకౌంట్ ల‌ను బ్లాక్ చేయిస్తాన‌ని వార్నింగ్ ఇచ్చింది.
renu desai
 
అకీరాకు చెందిన ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను తాజాగా రేణు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అయితే  తాను ఈ ఫోటోను చిన్నారి యూరోపియ‌న్ సినిమాలోని సీరియ‌స్ క్యారెక్ట‌ర్ లా క‌నిపిస్తున్నాడని అన్నారు. ఇక ఈ ఫోటోను ప‌వ‌న్ అభిమానులు డౌన్ లోడ్ చేసుకుని జూనియ‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని డిజైన్ చేసి వారి అకౌంట్ ల‌లో పోస్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నార‌ని మండిప‌డింది. 
 
అభిమానులు అకీరాను అలా పిలవ‌డం ఆపండ‌ని, ఆ పిలుపు వాడికి, వాడి నాన్న‌కు అమ్మ‌నైన త‌న‌కు ఇష్టం లేద‌ని రేణూదేశాయ్ అన్నారు. కాబ‌ట్టి ప‌వ‌న్ అభిమానులు జూనియ‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని పిల‌వ‌డం ఆపండ‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఒక వేళ‌ అలా పిలిస్తే తాను ఖ‌చ్చితంగా వారి అకౌంట్ ల‌ను బ్లాక్ చేయిస్తాన‌ని రేణూ పేర్కొన్నారు. అయినా కూడా ప‌వ‌న్ అభిమానులు కామెంట్ చేయ‌డం మాత్రం ఆప‌డంలేదు. చూడాలి మ‌రి ప‌వ‌న్ అభిమానుల‌పై రేణూ ఏ విధంగా స్పందిస్తారో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.