నేను ఎవరిని మోసం చేయలేదు అంటున్న మహేష్ బాబు ప్రొడ్యూసర్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

tollywood
Updated:  2018-07-17 03:58:29

నేను ఎవరిని మోసం చేయలేదు అంటున్న మహేష్ బాబు ప్రొడ్యూసర్

మహేష్ బాబు తో "భరత్ అనే నేను" వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించాడు నిర్మాత డివివి దానయ్య. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా ప్రొడ్యూస్ చేసిన ఆయన పై ఇండస్ట్రీ లో కొన్ని రూమర్స్ హలచల్ చేస్తున్నాయి అవేంటంటే ఆయన "భరత్ అనే నేను" టీం కి పూర్తీ డబ్బులు ఇవ్వలేదు అని చాలా మందికి డబ్బులు ఎగ్గొట్టారు అని కూడా టాక్ వినిపిస్తుంది.

కాని డివివి దానయ్య ఈ రూమర్స్ పై స్పందిస్తూ ఆ న్యూస్ అన్ని వాస్తవం కాదని నేను ఎవరికీ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టలేదని అందరికి కూడా రెమ్యునరేషన్ ఇచ్చానని అంటున్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. కొరటాల శివ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన చిత్రం "భరత్ అనే నేను". ఈ సినిమా వేసవిలో విడుదలైన మహేష్ కెరీర్ లోనే కాకుండా అటు కొరటాల ఇటు డివివి దానయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది భారీ వసూళ్ల ని సాధించింది.

అయితే దర్శకుడు కొరటాల శివ కు అలాగే హీరోయిన్ కైరా అద్వానీ తో పాటుగా కొంతమంది కి డివివి దానయ్య పూర్తిస్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వలేదని, లాభాలు వచ్చినప్పటికీ అవి నొక్కేసి వాళ్లకు డబ్బులు ఎగ్గొట్టాడని కథనాలు వచ్చాయి. ఈ రూమర్స్ మాత్రం తీవ్రంగా ఖదించాడు డివివి దానయ్య. ఇదిలా ఉంటె ప్రస్తుతం డివివి దానయ్య రామ్ చరణ్ సినిమాకి అలాగే రాజమౌళి సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.