ఆ విద్యార్థులు ఆత్మహత్య పై స్పందించిన ఆర్.ఎక్స్ 100 దర్శకుడు అజయ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

director ajay bhupathi
Updated:  2018-10-04 01:34:42

ఆ విద్యార్థులు ఆత్మహత్య పై స్పందించిన ఆర్.ఎక్స్ 100 దర్శకుడు అజయ్

ఈ ఏడాది యూత్ ని ఊపేసిన సినిమా ఏది అని అడిగితే టక్కున ఆర్.ఎక్స్ 100 అని సమాధానం ఇస్తారు. ఈ సినిమా ఇప్పుడు అనుకోకుండా వార్తల్లో నిలిచింది. ఈ సినిమా వార్తల్లో ఉండడానికి కారణం 'తెలంగాణలోని జగిత్యాల పట్టణంలో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఆత్మహత్య' చేసుకోవడం.. ఈ కేస్ ని విచారిస్తున్న పోలీస్ అధికారి ఆర్.ఎక్స్ 100 సినిమా వల్ల ప్రభావితం అయ్యి వాళ్ళు ఆత్మహత్య చేస్కున్నారంటూ వ్యాఖ్యానించారు..

అయితే చనిపోయిన ఇద్దరి లో ఒకడు ఎప్పుడు ''పిల్ల రా" పాటని వింటూ ఉండేవాడు అంటూ ఆయన చెప్పడం జరిగింది.. దీనికి సమాధానం గా స్పందించిన ఈ సినిమా హీరో, మేము సినిమా వాళ్ళం, మేమేమి టెర్రరిస్టులు కాదు అంటూ ఘాటుగానే స్పందించాడు. అంతే కాకుండా మా సినిమాలో హీరో ఆత్మహత్య చేస్కోడు, హీరోయిన్ చంపిస్తుంది అని చెప్పారు. ఈ సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి మాట్లాడుతూ, ఇది సెన్సార్ సభ్యులు ఏ సర్టిఫికెట్ జారీ చేసిన సినిమా, అంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళు చూడాల్సిన సినిమా.

కానీ అక్కడ చనిపోయిన వాళ్ళు 18 సంవత్సరాలు వయసు లేని వాళ్ళు, వాళ్ళని సినిమా చూడకుండా నిరోదించాల్సిన బాధ్యత తమది కాదంటూ లాజిక్ మాట్లాడాడు.. ఎంతైన రామ్ గోపాల్ వర్మ దగ్గర పని చేసిన అనుభవం ఉన్న అజయ్, అచ్చం సమాధానం కూడా వర్మ లాగే చెప్పాడు.. ఇతని మాటలకి పోలీసులు ఏం సమాధానం చెప్తారో వేచి చూడాలి.. పోలీసులు ఇవేం పట్టించుకోకుండా ఆత్మహత్య అని నిర్దారించుకొని కేస్ క్లోస్ చేసే పనిలో ఉన్నారని తెల్సుతుంది..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.