"ఆర్ఎక్స్ 100" సినిమా బైక్ ని వేలానికి పెట్టిన హీరో

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

rx 100 movie bike
Updated:  2018-08-21 12:25:27

"ఆర్ఎక్స్ 100" సినిమా బైక్ ని వేలానికి పెట్టిన హీరో

"ఆర్ఎక్స్ 100" సినిమాతో హీరో కార్తికేయ రెడ్డి తన యాక్టింగ్ టాలెంట్ ఏంటో మొత్తం చూపించాడు. ఈ సినిమా కార్తికేయ రెడ్డికి హీరో గా మంచి పేరు తీసుకొని వచ్చింది. అలాగే ఈ సినిమాలో కార్తికేయ వాడిన ఆర్ఎక్స్ 100 బైక్ కి కూడా మార్కెట్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.

అయితే ఆ బైక్ ఇప్పుడు వేలానికి రాబోతోంది. కేరళలో వరదలతో అల్లాడుతున్న జనాల కోసం సాయం అందించడానికి ఈ బైకును వేలం వేస్తున్నట్లు హీరో కార్తికేయ ప్రకటించాడు. నిజానికి తాను సినిమాలో వాడిన బైక్ అంటే చాలా చాలా ఇష్టమని. దాన్ని జీవితాంతం తన దగ్గరే పెట్టుకోవాలని అనుకున్నానని. కానీ కేరళ జనాలు పడుతున్న ఇబ్బందులు చూస్తే ఆ బైకుపై తన ప్రేమ చాలా చిన్నదనిపించిందని.

అందుకే దీన్ని వేలం వేయాలని నిర్ణయించుకున్నానని అతను వెల్లడించాడు. "ఆర్ఎక్స్ 100" సినిమా విషయంలో ఎలాగైతే సపోర్ట్ చేశారో ఈ వేలాన్ని కూడా ఇలాగే సపోర్ట్ చేయాలి అని కోరాడు కార్తికేయ రెడ్డి. అయితే ఈ వేలంలో పాల్గొనాలి అంటే కనీసం యాబై వేలు అయిన చేతిలో ఉండాలి అని కార్తికేయ రెడ్డి ప్రకటించాడు. 

 

షేర్ :