వ్యభిచారం మొదలెట్టిన విక్రమ్ హీరోయిన్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vikram heroine
Updated:  2018-09-05 11:30:35

వ్యభిచారం మొదలెట్టిన విక్రమ్ హీరోయిన్

శంకర్ లాంటి దర్శకుడితో “అపరిచితుడు” లాంటి చరిత్రాత్మక చిత్రం లో నటించిన కథనాయిక సదా. తెలుగు తమిళ స్టార్ హీరోల‌తో ఒక‌ప్పుడు జోడీ క‌ట్టిన ఈ భామ ప్రస్తుతం తన ఉనికి కోసం పోరాడుతుంది. పోలీసుల గోల ఈ మధ్య ఇండస్ట్రీలో ఎక్కువ అయిన సంగతి తెలిసిందే. ఈ టైమ్ లో స‌దా కోసం పోలీసుల వేట అంటే లేనిపోని అపోహలకు తెరలేపినట్టవుతుంది. కాకపోతే మనం మాట్లాడుకునేది అంత స్క్రీన్ మీద తియ్యడానికి మాత్రమే.
 
ఆఫర్లు లేక విలవిల్లాడుతున్న సమయంలో ఆమెకు ఒక అద్భుతమైన ఛాన్సు దొరికింది. కానీ అందులో ఆమె వ్య‌భిచారిగా న‌టించాలి. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది పేరున్న హీరోయిన్లు ఈ పాత్ర చేసిన‌వాళ్లే. తెలుగులో కూడా సహజనటి జయసుధ దగ్గర్నుండీ నిన్నమొన్నటి ప్రియ‌మ‌ణి.. అనుష్క లాంటి వాళ్లు కూడా ఈ త‌ర‌హా పాత్ర‌ల్లో న‌టించారు. బాలీవుడ్ లో రాణిముఖ‌ర్జీ.. అదితిరావ్.. క‌రీనా లాంటి ముద్దుగుమ్మ‌లు ప్రాస్టిట్యూట్స్ గా ఓ ఆట ఆడేశారు. ఇప్పుడు సదా కూడా  టార్చ్ లైట్ సినిమాలో వ్య‌భిచారిగా న‌టించింది.
 
అబ్దుల్ ముజీద్ దర్శకత్వంలో ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 7న విడుదల కానుంది. తాను ఈ చిత్రం కోసం చాలా కష్టపడినట్లు చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. నిజంగానే తాను వ్యభిచారిణుల దగ్గరికి వెళ్లి వారి వారి జీవిత స్థితి గతుల గురించి తెలుసుకుంది. ఈ చిత్ర ట్రైల‌ర్ లో కూడా ఆ కష్టం కనిపించింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.