చివరి షెడ్యూల్ కి చేరుకున్న సాహో

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

prabhas
Updated:  2018-08-11 11:39:54

చివరి షెడ్యూల్ కి చేరుకున్న సాహో

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “బాహుబలి” తరువాత నటిస్తున్న సినిమా “సాహో”. యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ  భారీ బడ్జెట్ చిత్రాన్ని “రన్ రాజా రన్” ఫేం సుజీత్ డైరెక్ట్ చేస్తున్నాడు, శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది, ప్రస్తుతం షూటింగ్ దశలో బిజీగా ఉన్న ఈ చిత్రం  చివరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ రొమేనియా వెళ్లనుంది, కథ-కథనాలలోని కీలక అంశాలను ఈ చివరి షెడ్యూల్ లో చిత్రీకరించి, ఈ చిత్ర షూటింగ్ ను ముగించేందుకు సిద్ధమయ్యారు చిత్రబృందం.

దాదాపు 150 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం అయుదు భాషల్లో విడుదల అవుతుండగా, ప్రముఖ బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ ఇషాన్ లాయి సంగీతం అందిస్తున్నారు, త్వరలోనే ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ "జిల్" దర్శకుడు రాధాకృష్ణతో  సినిమా చేస్తున్నాడు యూవి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ లో మొదలుకానుంది.

షేర్ :