మెగా స్టార్ సాయం కోరుతున్న సుప్రీమ్ హీరో

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

chiranjeevi and sai dharam tej
Updated:  2018-07-14 03:46:48

మెగా స్టార్ సాయం కోరుతున్న సుప్రీమ్ హీరో

వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న సాయి ధరం తేజ్ కెరీర్ ప్రస్తుతం క్లోసింగ్ దశలో ఉంది అని అందరూ అంటున్నారు. ఎందుకంటే సాయి ధరం తేజ్ నెక్స్ట్ చేసే సినిమా హిట్ అవ్వకపోతే ఇక సాయి ధరం తేజ్ పై డబ్బులు పెట్టడానికి ఏ ఒక్క ప్రొడ్యూసర్ కూడా ముందుకి రాడు.

కెరీర్ లో అత్యంత కీలకమైన టైంలో ఉన్న సాయిధరమ్ తిరిగి ఇమేజ్ పెంచుకునే సలహాల మెగా స్టార్ చిరంజీవికి కాల్ చేసాడు అంట. కథల జడ్జిమెంట్ లో మంచి పట్టున్న చిరు ఓకే చెబితేనే ఏ సినిమా అయినా చేద్దామని తేజు డెసిషన్ తీసుకున్నాడు అట. ఆల్రెడీ ఈ విషయం మీద తేజు చిరంజీవికి కాల్ కూడా చేసాడు అట.

ఇప్పుడు తాను చేస్తున్న "చిత్రలహరి" సినిమా స్క్రిప్ట్ ను కూడా చిరు దగ్గరకు పంపించాడు అట తేజు. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కథకి చిరంజీవి ఎలాంటి మార్పులు చెప్తాడో చూడాలి. ఇక మీదట ఏ స్క్రిప్ట్ వచ్చినా గాని చిరంజీవి ఓకే చేసాకే తేజు సినిమా చేస్తాడు అని దీని ద్వారా అర్ధం అవుతుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.