ఓకే చెప్పిన సాయిప‌ల్ల‌వి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine sai pallavi
Updated:  2018-06-13 06:35:11

ఓకే చెప్పిన సాయిప‌ల్ల‌వి

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో హీరో అయినా హీరోయిన్ అయినా తొంద‌ర‌గా అభిమానుల‌ను అల‌రిచ‌లేక‌పోతారు. అయితే కొంత మందిమాత్రం తెలుగులో ఒక్క‌సిమాలో న‌టించి స్టార్ హీరో, హీరోయిన్ కు ఉన్నంత క్రేజ్ ను తెచ్చుకుంటుంటారు. అలా తెచ్చుకున్న వారు తెలుగు ఇండ‌స్ట్రీలో చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తారు. ఒక వేల తెచ్చుకుంటే వారి న‌ట‌న‌కు అభిమానులు వేసే మార్కుల‌ని చెప్పిలి. అలా త‌క్కువ స‌మ‌యంలో కోట్లాది మంది అభిమానుల‌ను సొంతం చేసుకుంది సాయి ప‌ల్ల‌వి.
 
ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండ‌స్ట్రీలోకి శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వ వ‌హించిన ఫిదా సినిమాలో హీరోయిన్ గా న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది. ఈ సినిమాలో అచ్చ‌మై తెలంగాణయాలో మాట్లాడి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ సినిమా త‌ర్వాత సాయి ప‌ల్ల‌వికి తెలుగులో వ‌రుస అవ‌కాశాలు వ‌స్తేనే ఉన్నాయి.
 
అయితే ఇప్ప‌టికే ఈ ముద్దుగుమ్మ నాచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన మిడిల్ క్లాస్ అబ్బాయ్ చిత్రంలో హీరోయిన్ గా న‌టించి మ‌రోహిట్ ను త‌న ఖాతాలో వేసుకుంది. ఇక తాజాగా ఆమె శర్వానంద్ తో 'పడి పడి లేచే మనసు' సినిమా లో చేస్తోంది. అయితే ఇప్ప‌టికే  ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా షూటింగ్ లో ఉండ‌గానే మ‌రో రెండు చిత్రాల‌కు ఓకే చెప్పింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  ఓనమాలు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలతో దర్శకుడిగా క్రాంతిమాధవ్ మంచి పేరు తెచ్చుక‌న్నారు. అయితే తాజాగా మాధ‌వ్ ద‌ర్శంలో వ‌స్తున్న ఓ చిత్రానికి సాయిప‌ల్ల‌వి ఓకే చెప్పింద‌ని స‌మాచారం. ఈ చిత్రానికి విజయ్ దేవరకొండ హీరోగా న‌టించ‌నున్న‌ర‌ట‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.