వంద కోట్లు ఇచ్చిన అలాంటివి చెయ్యను అంటున్న సాయి పల్లవి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sai pallavi
Updated:  2018-09-01 01:22:44

వంద కోట్లు ఇచ్చిన అలాంటివి చెయ్యను అంటున్న సాయి పల్లవి

"ఫిదా" సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన సాయి పల్లవి అతి తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకొని అభిమానుల్ని సంపాదించుకుంది. ప్రస్తుతం సాయి పల్లవి శర్వానంద్ తో కలిసి "పడి పడి లేచే మనసు" సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
 
ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే సాయి పల్లవికి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈ కోవలోనే సాయి పల్లవి ముందుకి ఒక ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చింది అంట, ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేయడమే కాకుండా వేరే ప్రొడ్యూసర్స్ కి కూడా మీరు వంద కోట్లు ఇచ్చిన నేను ఐటెం సాంగ్స్ చెయ్యను అని ఖరాకండిగా చెప్పేసింది అంట సాయి పల్లవి.
 
మొన్నటికి మొన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ అవకాశం ఉంటే, కథకి ప్రాధన్యం లేని పాత్రల్లో అస్సలు నటించను అని ఆ సినిమాని కూడా రిజెక్ట్ చేసింది సాయి పల్లవి. దీన్నీ బట్టి చూస్తుంటే ఫ్యూచర్ లో ఏ ప్రొడ్యూసర్ కథకి సంభందం లేని పాత్రని సాయి పల్లవి దగ్గరకి తీసుకొని వెళ్తే రిజెక్ట్ చేయడం ఖాయం అని భావిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.