సై రాకి కూడా లీకులు తప్పట్లేదు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sai ra
Updated:  2018-08-24 04:55:36

సై రాకి కూడా లీకులు తప్పట్లేదు

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా "సై రా నరసింహరెడ్డి". సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా యొక్క టిజర్ ఇటివలే రిలీజ్ అయ్యి ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా కూడా లీకుల బాట పట్టింది.
 
కానీ లీక్ అయ్యింది వీడియో కాదు కేవలం ఒక్క డైలాగ్ మాత్రమే. ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ రచయితలుగా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి పరుచూరి బ్రదర్స్ ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం గురించి అధ్యనం చేసి ఈ కథని రూపొందించారు.
 
ఈ చిత్రంలో కీలక సన్నివేశంలో మెగాస్టార్ చిరంజీవి చెప్పే డైలాగ్ ని పరుచూరి గోపాల కృష్ణ లీక్ చేశారు.ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే "చేతులు విరిచేశాం.. ముఖం ముందు ఉరితాడు ఉంది.. ఏంట్రా ఆ ధైర్యం" అని విలన్ అంటే. "చచ్చి పుట్టిన వాడిని.. చనిపోయిన తరువాత కూడా బ్రతికే వాడిని.. చావంటే నాకెందురా భయం" అని చిరంజీవి అంటారు. సినిమాలో ఒక ముఖ్య సన్నివేశంలో వచ్చే డైలాగ్ అంట ఇది. ఇదిలా ఉంటే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతుంది. 
 
 

షేర్ :