దుమ్ము లేపుతున్న

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-08-21 17:34:09

దుమ్ము లేపుతున్న

మెగా అభిమానులు అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న "సై రా నరసింహ రెడ్డి" టిజర్ రానే వచ్చింది. మెగా స్టార్ చిరంజీవి పుట్టిన రోజు సంధర్బంగా ఈ టిజర్ ని రిలీజ్ చేసారు మూవీ యూనిట్. ఈ టిజర్ లో చిరంజీవి లుక్ చూసిన వారికి చిరంజీవి లుక్ వల్లే సినిమా సగం హిట్ అవుతుంది అనే నమ్మకం కలుగుతుంది.

ఎందుకంటే చాలా కాలం తరువాత ఒక యోధుడి గెట్ అప్ లో చిరంజీవి కనిపించాడు. టిజర్ మొత్తంలో చిరంజీవి ఎంతో ఇంటెన్సిటీ తో కనిపించాడు, మధ్యలో ఒక్క దగ్గర "ఈ యుద్ధం ఎవరిది" అనే డైలాగ్ చెప్తాడు చిరంజీవి. ఇకపోతే ఈ టిజర్ లో మనం అధ్బుతమైన కెమెరా పనితనాన్ని చూడొచ్చు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది కూడా సూపర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెగా చిరంజీవికి మెగా ఎలేవేషన్ ఇచ్చాడు.

సురేందర్ రెడ్డి ఈ సినిమాని ఎంత హుందాగా తెరకేక్కిస్తున్నాడు అనేది టిజర్ చూస్తే అర్ధం అవుతుంది. ఇకపోతే టిజర్ చివర్లో గురాన్ని గాల్లోకి లేపి మెగా అభిమానులకి మెగా గిఫ్ట్ ని అందించాడు చిరంజీవి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2019 సమ్మర్ లో రిలీజ్ కానుంది. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.