మా ఫ్యామిలీ ని టచ్ చేసే దమ్ము ఎవరికి లేదు..సైఫ్ అలీ ఖాన్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

saif ali khan
Updated:  2018-10-29 11:13:10

మా ఫ్యామిలీ ని టచ్ చేసే దమ్ము ఎవరికి లేదు..సైఫ్ అలీ ఖాన్

భారతీయ చిత్ర పరిశ్రమలో మీటూ ఉద్యమ తాకిడి ఎక్కువగా ఉన్న చిత్ర పరిశ్రమ బాలీవుడ్. స్టార్ హీరోయిన్స్ సైతం ఈ ఉద్యమం లో భాగంగా తమ అనుభవాలను మీడియా తో పంచుకున్నారు. దర్శకులు, నటులు అని తేడా లేకుండా ఆరోపణలు కొందరిని చుట్టుముట్టాయి.ఆ ఉద్యమం కారణంగా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది పరువు బజారున పడుతోంది.

జూనియర్ ఆర్టిస్టుల నుండి స్టార్ సెలబ్రెటీల వరకు కూడా మీటూ ఉద్యమం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో సంవత్సరాల క్రితం చేసిన తప్పుకు కూడా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ మీటూ గురించి స్పందించాడు.తన కుటుంబంకు చెందిన వారు ఎవరు కూడా లైంగిక వేదింపులు ఎదుర్కోలేదు. నా తల్లి - కూతురు - భార్య ఇండస్ట్రీలో ఉన్నారు. అయినా కూడా వారు ఇప్పటి వరకు ఏ ఒక్కరి ద్వారా వేదింపులను ఎదుర్కోలేదు. వారిని లైంగికంగా వేదించే దమ్ము ఎవరికి లేదు.

ఆ సాహసం ఇప్పటి వరకు ఎవరు చేయలేదు ఇకపై కూడా ఎవరు చేయరనే నేను అనుకుంటున్నాను అంటూ సైఫ్ అలీ ఖాన్ చెప్పుకొచ్చాడు. వారి చుట్టు ఫేమ్ - ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉండటం వల్ల వారి జోలికి ఎవరు రావట్లేదని తాను భావిస్తున్నాను అన్నాడు.మీటూ ఉద్యమం కారణంగా ఎంతో మంది మహిళలు వర్క్ ఏరియాలో ప్రశాంతంగా పని చేసుకునే అవకాశం ఉంటుందని ఈ ఉద్యమం ఎదో గాలివాటం కాదని, భవిష్యత్తులో కూడా మీటూ ఉంటుందని తాను భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.