స‌స్పెన్స్ లో సైరా మూవీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-12 12:16:28

స‌స్పెన్స్ లో సైరా మూవీ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి గురించి ఇప్పుడు టాలివుడ్ స‌ర్కిల్ లో మ‌రో వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ చిత్రానికి  మ్యూజిక్ కు సంబంధించి డైరెక్ట‌ర్ ను ఎంపిక చేశార‌నేది వార్త‌.ముందుగా ఏఆర్‌ రెహమాన్ సంగీతం అందిస్తార‌ని అధికారికంగా ప్ర‌క‌టించారు. కానీ, డేట్లు స‌ర్దుబాటు కాక‌పోవ‌టంతో రెహ‌మాన్ ఈ చిత్రం నుంచి త‌ప్పుకున్నారు. 
 
ఆ త‌ర్వాత   థ‌మ‌న్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. అనంత‌రం   కీర‌వాణీ పేరు  వినిపించింది. ఇక ఇప్పుడు క్లాసిక్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇశ‌య‌రాజా పేరు చక్కర్లు కొడుతోంది. అందుకు కారణం చిరు ఇళయరాజాను కలిశాడన్న ఓ వార్తే. అయితే సైరా చిత్రం చరిత్ర‌కు సంబంధించిన క‌థ కావటంతో పాటల కన్నా  బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌పైనే ప్రేక్షకులు  ఎక్కువగా  కనెక్ట్‌ అయ్యే అవకాశం ఉంటుందని చిరు భావిస్తున్నార‌ట‌. ఈ నేపథ్యంలో కీరవాణి వైపే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉండొచ్చని టాక్‌.
 
ఇప్పటికే మొదటి షెడ్యూల్‌  పూర్తి చేసుకున్న సైరా.. రెండో షెడ్యూల్‌కు రెడీ అయిపోయింది. అయినప్పటికీ ఇప్పటిదాకా మ్యూజిక్‌ డైరెక్టర్‌ విషయంలో స్పష్టత లేకపోవటం విశేషం. ఏది ఏమైనా ఈ ఊహాగానాలకు త్వరలో నిర్మాత రామ్‌ చరణ్‌ పుల్‌ స్టాప్‌ పెట్టాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.