సైరా నుంచి సూప‌ర్ హీరో అవుటేనా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-28 11:48:50

సైరా నుంచి సూప‌ర్ హీరో అవుటేనా

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా సైరా న‌ర‌సింహ‌రెడ్డి తెర‌కెక్కుతున్న‌విష‌యం అంద‌రికి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ఇప్ప‌టికే కావాల్సినంత ప‌బ్లిసిటి వ‌చ్చింది. దానికి కార‌ణం తొలి స్వాతంత్ర ఉద్య‌మకారుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రెడ్డి క‌థ‌ను తెర‌కెక్కించ‌డం ఒక విష‌యం.

రికార్డుల‌ను తిరిగి రాయ‌డ‌మే ల‌క్ష్యంగా అన్ని ఏర్పాట్ల‌ను సిద్దం చేసుకుంటున్నాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. అందులో భాగంగానే అన్ని భాష‌ల్లో నుంచి అగ్ర న‌టుల‌ను తీసుకొవాల‌నుకొవ‌డం మ‌రొక విష‌యం. ఈ చిత్రంలో కీలక పాత్రకు బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ ను కూడా తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పాత్ర నుంచి అమితాబ్ త‌ప్పుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ సైరా న‌ర‌సింహ‌రెడ్డికి గురువు పాత్ర చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. రికార్డులు చెరిపే విధంగా తీయాల‌నుకున్న ఈ సినిమాకు ఇలాంటి స్టార్ హీరో మిస్స్‌స్ అవ్వ‌డం పెద్ద లోటే అని చెప్ప‌వ‌చ్చు. కొన్ని కార‌ణాల రిత్యా సైరా న‌ర‌సింహ‌రెడ్డి ప్రాజెక్టు నుంచి త‌ప్పుకోవ‌చ్చు అని మెగా క్యాంప్‌కు స‌మాచారం అందినట్లు తెలుస్తోంది. దీని పై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.