రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సై రా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-05 13:26:56

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సై రా

మెగా స్టార్ చిరంజీవి "ఖైది నెంబర్ 150" తరువాత నటిస్తున్న సినిమా "సై రా నరసింహ రెడ్డి". ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ని స్టైలిష్ డైరెక్టర్ అయిన సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. 

ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మూడో షెడ్యూల్ కి రెడీ అవుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చ్ లో రిలీజ్ చేయాలి అని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నారు అట. అసలైతే వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాని రెడీ చేయాలి అనుకున్నారు కాని షూటింగ్ లేట్ అవుతుండటం వల్ల మూవీ ని మార్చ్ కి పోస్ట్ పోన్ చేయమని మూవీ యూనిట్ కి చిరంజీవి చెప్పినట్టు తెలుస్తుంది.

కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ అయిన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే తమిళ హీరో అయిన విజయ్ సేతుపతితో తెలుగు లేటెస్ట్ విలన్ అయిన జగపతి బాబు కూడా ఈ మూవీ లో పలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రత్నవేలు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందిస్తున్నాడు.

 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.