టాక్సీ డ్రైవర్ గా మారిన సమంతా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-10 17:49:26

టాక్సీ డ్రైవర్ గా మారిన సమంతా

సమంతా అక్కినేని ప్రస్తుతం పవన్ కుమార్ దర్శకత్వంలో "యు టర్న్" అనే సినిమా చేస్తుంది. ఇది పూర్తి స్థాయి లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సినిమా. ఈ సినిమా తరువాత సమంతా మరొక థ్రిల్లర్ లో నటించనుంది అంట. కైరోస్ కంటెంట్ స్టూడియోస్ పై క్రిష్ మణికర్ణిక ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

"అర్జున్ రెడ్డి" దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన గిరిశయ్య ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇతను ఇదివరకు "భీమవరం బుల్లోడు" "ఎవడే సుబ్రహ్మణ్యం" వంటి సినిమాలకి కూడా గిరిశయ్య పని చేసాడు. సమంతా ఈ సినిమాలో టాక్సీ డ్రైవర్ గా నటించనుంది అట.

హాలీవుడ్ లో వచ్చిన "కొల్లటేరాల్" సినిమా లాగ ఈ సినిమా ఉండబోతుంది అని దర్శకుడు అంటున్నాడు. జూలై 23 నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతున్న ఈ సినిమాలో అదిత్ అరుణ్, నవదీప్, సాయి చంద్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. "అర్జున్ రెడ్డి" సినిమాకి నేపధ్య సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.