సమంత కి సింగల్ గా వెళ్లే సత్తా లేదా..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

samantha
Updated:  2018-10-06 03:14:52

సమంత కి సింగల్ గా వెళ్లే సత్తా లేదా..?

సినిమా పరిశ్రమలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత హీరోయిన్ల కి సరిగ్గా సరిపోద్ది.. అభినయం తో ఆకట్టుకున్న వారైనా, గ్లామర్ రోల్స్ చేసిన వాళ్ళైన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నపుడు, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడానికి ఇష్టపడతారు.. కానీ మన టాలీవుడ్ మేల్ డామినేషన్ ఇండస్ట్రీ అవ్వడం వల్ల ఆ ట్రెండ్ కొనసాగలేకపోయింది.. అప్పట్లో విజయశాంతి గ్లామర్ రోల్స్ చేసాక కూడా భారీ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి, అప్పటి హీరోలకి పోటీ ఇచ్చింది..

అలాగే ఆ తరువాత కేవలం అనుష్క మాత్రమే అలా చెయ్యగలిగింది.. అరుంధతి, సైజ్ జీరో,భాగమతి లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో మెప్పించింది... అలాంటి ప్రయోగమే ఈ మధ్య సమంత 'యూ టర్న్' రూపం లో చేసింది.. అయితే అది ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు.. కెరీర్ కొత్తలో గ్లామర్ డాల్ గా కనిపించిన సమంత, తరువాత నటన కి ఆస్కారం ఉన్న పాత్రలు చేసింది.. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో కనిపించాలనుకుంటుంది అని సమాచారం.. అయితే యూటర్న్ చిత్రంకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం నెగటివ్ లో ఉన్నాయి.

డిస్ట్రిబ్యూటర్లకు ఈ చిత్రం ఏకంగా మూడున్నర కోట్ల వరకు నష్టాలను మిగిల్చినట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. దీనితో సమంత కి బాక్స్ ఆఫీస్ పై ఒంటరిగా వెళ్లే అంత స్టామినా లేదని అంటున్నారు అంతా... సమంత ముందు ముందు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసినా కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు తేల్చిచెప్పేశారు.. కాబట్టి దర్శక నిర్మాతలు ఇక నుండి సమంత తో ఏదైనా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చెయ్యాలి అనుకున్నప్పుడు ఆలోచించాల్సిందే...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.