నాగ చైతన్య కి పోటీగా మారిన అక్కినేని నాగ చైతన్య

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

chaithu and samantha
Updated:  2018-08-23 05:47:08

నాగ చైతన్య కి పోటీగా మారిన అక్కినేని నాగ చైతన్య

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా "శైలజా రెడ్డి అల్లుడు". మారుతీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అసలైతే ఆగష్టు 31 న రిలీజ్ అవ్వాలి. కానీ ఇంకా సినిమాకి సంభందించిన పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కానందు మూలాన సినిమాని సెప్టెంబర్ 13 న రిలీజ్ అవుతుంది.

అయితే అదే రోజు అక్కినేని సమంతా హీరోయిన్ గా నటించిన "యు టర్న్" అనే సినిమా కూడా రిలీజ్ అవుతుంది. కెరీర్ లో మొదటి సారి వేరు వేరు సినిమాలతో ఇలా పోటీకి దిగారు ఈ దంపతులు. ఇదిలా ఉంటే అదే రోజు సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న "నను దోచుకుందువటే" అనే సినిమా కూడా రిలీజ్ అవుతుంది.

నాగ చైతన్య, సమంతా మధ్యలోనే గట్టి పోటీ ఉంది అనుకుంటే మధ్యలో సుధీర్ బాబు వచ్చి చేరాడు. ఇదిలా ఉంటే వీళ్ళ ముగ్గురు కలిసి "ఏ మాయ చేసావే" అనే సినిమాలో నటించారు. ఆ సినిమా నాగ చైతన్య ఇంకా సమంతా హీరో హీరోయిన్స్ గా నటిస్తే సమంతా కి అన్నయ్య పాత్రలో సుధీర్ బాబు నటించాడు. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.