నాకు పేరు వద్దు డబ్బులు మాత్రమే కావలి ‍సమంతా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-09-14 17:28:48

నాకు పేరు వద్దు డబ్బులు మాత్రమే కావలి ‍సమంతా

అక్కినేని సమంతా పెళ్ళయ్యాక వరుస పెట్టి హిట్స్ కొడుతూనే ఉంది, నిన్న రిలీజ్ అయిన "యు టర్న్" తో ఈ ఏడాది మరొక హిట్ ని అందుకుంది సమంతా. అయితే సమంతా కి హిట్స్ ఫ్లాప్స్ తో సంభందం లేదు అంట కేవలం డబ్బులు మాత్రమే కావలి అంట. అవును సమంతా కి ఇంత డబ్బు పిచ్చా అని తను అన్న మాటలు విన్నాక అర్ధం అవుతుంది. ఈ విషయం గురించి సమంతా మాట్లాడుతూ "సినిమా అనేది బిజినెస్. ఎవరైనా లాభాలు రావాలని సినిమాలు తీస్తారు. సినిమాకు పేరు వచ్చి, వసూళ్లు రాకపోతే ఎందుకు? నాకు పేరు ముఖ్యం కాదు. వసూళ్లే ముఖ్యం. సినిమాకు డబ్బులు రావడమే ముఖ్యం. డబ్బు లేకపోతే ఏది లేదు. అందుకని, ‘యూ టర్న్’ సినిమా ప్రారంభించే ముందు బడ్జెట్ గురించి ఆలోచించి ముందుకు వెళ్ళాము.

షూటింగులో లగ్జరీలు నాకు ముఖ్యం కాదు. మంచి సినిమాలో భాగం కావడం ముఖ్యం. ‘యూ టర్న్’ మంచి సినిమా అని తెలుసు. కన్నడలో ట్రయిలర్ విడుదల కాగానే దర్శకుడు పవన్ కుమార్ కి ఫోన్ చేశా. స్క్రిప్ట్ మెయిల్ చేయమని అడిగా. నాకు బాగా నచ్చింది. అందువల్ల షూటింగులో లగ్జరీల గురించి ఆలోచించకుండా సినిమా చేశా” అంటూ తన డబ్బు పిచ్చి గురించి చెప్పుకొచ్చింది సమంతా.

షేర్ :