అభిమానులకి భూతు సింబల్ చూపించిన సమంత

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

samantha
Updated:  2018-09-28 12:05:23

అభిమానులకి భూతు సింబల్ చూపించిన సమంత

మన జీవితంలో మనం ఎలా ఉండాలో నిర్ణయించుకునే హక్కు మనకి పూర్తిగా లేకుండా చేస్తుంది ఈ సమాజం. ఇది వరకు చుట్టూ పక్కలవాళ్ళు మనల్ని నన రకాలుగా ఇబ్బంది పెట్టేవారు. మనం చేసిన ప్రతి పనిలో వేళ్ళు పెట్టి కెలికేసేవారు. రాను రాను అది సామాజిక మధ్యమాలలో కూడా ఎక్కువ అయ్యింది. మనం ఏదన్నా ఫోటో పెడితే మన స్నేహితులు మనల్ని ఎడిపించడానికి సరదా కామెంట్స్ పెడతారు. అది ఒకే.

కానీ కొంత మంది ముక్కు మొహం తెలియని వాళ్లు వారికిష్టం వచ్చినట్లు వాగితే వారు సరాసరి బ్లాక్ లిస్ట్ కి పోవడం ఖాయం.అసలు మ్యాటర్ లోకి వెళితే, మొన్నటి వరకు సినిమాలతో వాటి తాలూకా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీ గా గడిపేసిన చై-సామ్ లిద్దారు ఇప్పుడు హాలిడే ని ఎంజాయ్ చేస్తున్నారు. మన సామ్ ఇంస్టాగ్రామ్ లో కొంచెం ఆక్టివ్ కాబట్టి తన ఫొటోస్ ని అప్లోడ్ చేస్తుంది.

ఇందులో ఏముంది అనుకోకండి..! ఆ ఫొటోస్ కొంచెం మోడరన్ గా ఉండటం తో ఎవడో సంప్రదాయ సోషల్ మీడియా ప్రవక్త తనని కొంచెం డిసెంట్గా ఉండాలంటూ కమెంట్ పెట్టాడు.నా పెళ్లి తర్వాత నేను ఎలా ఉండాలో చెప్పే వారందరికీ అంటూ ఒక మిడిల్ ఫింగర్ చూపించేసింది మన సామ్.  మళ్ళీ అలాంటి కామెంట్స్ రాలేదు సుమీ. కొంతమంది ఆకతాయిలు మాత్రం సమంత కొత్త సిగ్నేచర్ బాగుందంటూ చమక్కులు పేలుస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.