వీడియో లీక్ పై సీరియస్ అయిన సమంతా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

samantha
Updated:  2018-10-27 04:07:21

వీడియో లీక్ పై సీరియస్ అయిన సమంతా

సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఫొటోస్ , వీడియోస్ లీక్ అవ్వడం టాలీవుడ్ లో సంప్రదాయం గా మారిపోయింది. మొన్న ఆ మధ్య టాక్సీవాలా, గీత గోవిందం రెండు ముందే లీక్ అయిపోయాయి. అంతకుముందు సైరా షూటింగ్ పిక్స్ లీక్ అయ్యాయి. అయితే ఇప్పుడు సమంత,నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రంలో చిన్న వీడియో లీక్ అయింది.

సమంత-చైతన్య ఇద్దరికు పెళ్లి అయ్యాక కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో అందరికి దీని పై భారీ అంచనాలు ఉన్నాయి.అయితే ఈ చిత్రానికి మజిలీ అని పేరు పెట్టారు. అయితే ఈ చిత్రం సెట్స్ నుండి చిన్న వీడియో లీక్ అయింది. తన ఫ్యాన్ ట్విట్టర్ ద్వారా ఈ వీడియో ని ఇంటర్నెట్ లో పెట్టాడు.ఈ లీక్ పై సమంత స్పందిస్తూ సీరియస్ అయ్యింది. ఇలా మరొకసారి రిపీట్ చెయ్యొదు అని చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.

శివ అంతకుముందు నాని తో నిన్ను కోరి తీసిన సంగతి తెలిసిందే. అది యావరేజ్ టాక్ రాబట్టిన శివ కి దర్శకత్వ పరంగా మంచి పేరు తెచ్చిపెట్టింది. మజిలీ సినిమాలో నాగ చైతన్య-సమంత భార్యభర్తలు గా నటిస్తున్నారు. అంతకుముందు ఏమయచేసావే, ఆటోనగర్ సూర్య,మనం సినిమాల లో వీరిద్దరూ కలిసి నటించారు.అయితే అవి పెళ్లి కాకముందు, ఇప్పుడు పెళ్లి అయ్యాక నటించడం తో అక్కినేని అభిమానులు ఆనందంలో ఉన్నారు.

షేర్ :