పోలీసులకి అడ్డంగా దొరికిపోయిన సమంతా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

samantha akkineni
Updated:  2018-09-01 02:56:00

పోలీసులకి అడ్డంగా దొరికిపోయిన సమంతా

సమంతా ఇప్పుడు స్టార్ హీరోయిన్ తో పాటు అక్కినేని ఇంటి కోడలు, అందుకే సమంతా పబ్లిక్ లో ఇప్పుడు ఏ పని చేసిన చాలా జాగ్రత్తగా చేయాలి. అయితే సమంతా హీరోయిన్ కాకముందు తన కాలేజీ డేస్ మొత్తాన్ని చెన్నై లో గడిపింది సమంతా. ఆ చెన్నై లోనే సమంతా కి ఒక  రోజు చేదు అనుభవం ఎదురైంది అంట. అదేంటి అంటే సమంతా ని ఒకరోజు పోలీసులు అడ్డంగా పట్టుకున్నారు అంట.
 
ఈ విషయం గురించి సమంతా మాట్లాడుతూ "నేను 11వ క్లాసులో ఉన్నప్పుడే నాన్నగారు స్కూటీ కొనిచ్చారు. దానిపై పల్లవరం ఇన్ సైడ్ వీధుల్లో ఎంతైనా తిరగొచ్చని కానీ బయట మాత్రం తిరగొద్దు అని నాన్న స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తో పనేం ఉంటుంది? అందుకే స్వేచ్ఛగా తిరిగేసేదాన్ని. ఓసారి ఎవరికీ చెప్పకుండా లైసెన్స్ లేకుండానే స్కూటీ మీద విమానాశ్రయానికి వెళ్లిపోయాను.
 
పోలీసులు ఆపి లైసెన్స్ అడిగారు. ప్లీజ్ ప్లీజ్ అంటూ రెక్వస్ట్ చేసుకుని ఏదోలా అప్పటికి తప్పించుకున్నాను" అని తనకి జరిగిన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది సమంతా. ఇదిలా ఉంటే సమంతా హీరోయిన్ గా నటించిన "యు టర్న్" సినిమా వచ్చే సెప్టెంబర్ 13 న రిలీజ్ అవుతుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.