పెళ్లి తరువాత అలాంటిది ఏమి లేదు అంటున్న సమంత

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

samantha
Updated:  2018-08-25 11:00:11

పెళ్లి తరువాత అలాంటిది ఏమి లేదు అంటున్న సమంత

అక్కినేని నాగ చైతన్య ని పెళ్లి చేసుకని అక్కినేని సమంతా గా మారి అక్కినేని వారసత్వాన్ని పుచ్చుకుంది సమంతా. అయితే మన ఇండస్ట్రీ లో ఒక అపోహ ఉంది అది ఏంటంటే, ఒక స్టార్ హీరోయిన్ కి పెళ్లి అయ్యాక ఆ హీరోయిన్ మార్కెట్ పూర్తిగా పడిపోతుంది అని.

పెళ్లి తరువాత చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతాయి అని ఆ రకంగా పెళ్లి అయిన హీరోయిన్స్ కి అవకాశాలు తగ్గి సినిమాల నుంచి దూరం అవుతారు అనే అపోహ గట్టిగా ఉంది. కానీ సమంతా విషయంలో మాత్రం ఇలా అస్సలు జరగట్లేదు. ఇంకా చెప్పాలి అంటే పెళ్లి తరువాత స్టార్ హీరోయిన్ గా సమంతా మార్కెట్ ఇంకా పెరిగింది. ప్రస్తుతం సమంతా వరుస హిట్స్ తో దూసుకుపోతుంది.

పెళ్లి తరువాత సమంతా నటించిన "రంగస్థలం" "మహానటి" "అభిమన్యుడు" బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నాయి. ఇప్పుడేమో "యు టర్న్" అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది సమంతా. ఈ సినిమా సెప్టెంబర్ 13 న రిలీజ్ కి రెడీ అవుతుంది. పెళ్లి తరువాత హీరోయిన్స్ హిట్ కొట్టలేరు అనే దాన్ని బ్రేక్ చేస్తూ హిట్టు కొట్టాలి అని తానూ డిసైడ్ అయినట్టు సమంతా చెప్పుకొచ్చింది.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.