నేను పిల్లల్ని కనడానికి రెడీ..కానీ చైతూ...

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

samantha and chaitu
Updated:  2018-09-12 05:06:47

నేను పిల్లల్ని కనడానికి రెడీ..కానీ చైతూ...

నాగచైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు’ మరియు సమంత ‘యూటర్న్’ చిత్రాలు ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. యూటర్న్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత తన భర్త విషయమై పిల్లల విషయమై పలు  కామెంట్స్ చేసింది. ఇంటర్వ్యూలో భాగంగా పిల్లలు ఎప్పుడు అంటూ ప్రశ్నించగా.. నాకు ఎప్పుడెప్పుడు పిల్లలను కనాలని ఉంది.
 
కాని చైతూకు మాత్రం అల కాదు. అతనికి ఇప్పట్లో పిల్లలను కనే ఉద్దేశ్యం లేదు. చైతూను ఈ విషయంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చింది. పిల్లల విషయంలో చైతూ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు నేను రెడీ.. ఇంకా డౌట్స్ ఉంటే మా ఆయన్నే అడగండి అంది..
 
చైతూ నటించిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటాను. అదే సమయంలో నేను నటించిన యూటర్న్ చిత్రం కూడా బాగా ఆడాలని - మంచి డబ్బులు రావాలని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. యూటర్న్ చిత్రంతో తనకు పేరు కంటే మంచి బిజినెస్ జరగాలని కోరుకుంటున్నాను అంది. పెళ్లి తర్వాత సినిమాల ఎంపిక విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. గతంలో లా వచ్చిన ప్రతి ఆఫర్ను కాకుండా మంచి క్యారెక్టర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను అంది. పరిపూర్ణమైన నటిని అనిపించుకునేందుకు ‘యూటర్న్’ చిత్రంలోని తన సొంత గొంతునే వాడినట్లు చెప్పింది.