పవన్ కి ఐ లవ్ యూ చెప్పిన సమంత

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

samantha
Updated:  2018-11-01 04:43:50

పవన్ కి ఐ లవ్ యూ చెప్పిన సమంత

పవన్ కి సమంత ఐ లవ్ యూ చెప్పడం ఏంటి అనా..? మీరు చదివింది నిజమే..  ట్విట్టర్ వేదిక గా పవన్ కి సమంత ఐ లవ్ యూ అని చెప్పింది... మీరు పవన్ కళ్యాణ్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే మరి. ఇంతకీ ఎవరా పవన్ అని తెలుసుకోవాలని ఉందా? సమంత కీలక పాత్ర పోషించిన చిత్రం యు టర్న్.

ఆ సినిమా సమంతకు మంచి పేరు తీసుకువచ్చింది దాంతో ఆ సినిమా అంటే ఇష్టం.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు పేరు పవన్. సినిమాకు దర్శకత్వం వహించిన పవన్ కుమార్ అంటే మరింత ఇష్టమని అంటోంది. పవన్ కుమార్ వర్కింగ్ స్టైల్ సమంతకు నచ్చడంతో అతడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐ లవ్ యు మై ఫ్రెండ్ అని ట్వీట్ చేసింది ఇంకేముంది ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.సమంత నాగచైతన్య ని ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే కుర్ర డైరెక్టర్ కు విషేష్ చెప్పడం వైరల్ గా మారింది. పైగా కొంతమంది నెటిజన్ లు సమంత ని ట్రోల్ చేయడం జరిగింది.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే సమంతతో నెటిజన్ కు ఎప్పుడు ఏదొక గొడవ..! ఎందుకంటే ఆమె ఎప్పుడు తప్పు చేసి దొరుకుద్దా..? అని వెతికే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు దాంతో సమంత ట్వీట్స్ వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ ట్వీట్ మరో స్థాయి కి చేరేలా ఉంది

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు