ఎన్టీఆర్ - నాని పై సంజ‌న కామెంట్ వైర‌ల్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-06-20 17:14:23

ఎన్టీఆర్ - నాని పై సంజ‌న కామెంట్ వైర‌ల్

నాని అంటేనే స‌ర‌దా మాట‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్... పోస్ట‌ల్ స్టాంప్ లేకుండానే అంద‌రికి క‌నెక్ట్ అవుతాడు ఈ హీరో.. అసిస్టెంట్ లెవ‌ల్ నుంచి పెద్ద హీరో స్టార్ డ‌మ్ సంపాదించుకున్నాడు ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి.. సో నాని ఇప్పుడు బిగ్ బాస్ షోతో మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు తెలుగు ప్రేక్ష‌కుల‌కు.. ఇక రాత్రి అయితే చాలు బిగ్ బాస్ కోసం టీవిల ముందు అతుక్కుపోతున్నారు సినీ ప్రియులు. ఓ ప‌క్క వెండితెర‌పై వ‌రుస హిట్లు కొడుతూ మ‌రో ప‌క్క ఇటు బుల్లి తెర‌పై బిగ్ బాస్ తో అల‌రిస్తున్నాడు ఈ హీరో.
 
బిగ్ బాస్ 1 వ్యాఖ్యాత‌గా ఎన్టీఆర్ చేస్తే.. బిగ్ బాస్ 2 కి హోస్ట్ గా నాని చేస్తూ సందడి చేస్తున్నాడు.. త‌న పంచ్ ల‌తో కామెడితో కొత్త సంద‌డి క్రియేట్ చేస్తున్నాడు... అయితే ఫ‌స్ట్ వీక్ ఎలిమినేష‌న్ తో సంజ‌న బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.. సంజ‌న  బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఓ వెబ్ ఛాన‌ల్ కు ఇంట‌ర్వూ ఇచ్చింది.. ఈ స‌మ‌యంలో వ్యాఖ్యాత నానిపై ప‌లు కామెంట్లు చేసింది ఆమె.
 
యాంక‌రింగ్ విష‌యంలో ఎన్టీఆర్ ఐఫోన్ అయితే నాని చైనా ఫోన్ అని ఓ పెద్ద కామెంట్ చేసింది సంజ‌న‌.. ఓ సారి ఐఫోన్ వాడితే వేరొక‌టి ఎవ‌రికి న‌చ్చ‌వు అని ఇంట‌ర్వ్యూలో చెప్పింది.. నాకూ అంతే అని నానిపై స‌టైర్ వేసింది.. సో ఇక్క‌డ నాని యాంక‌రింగ్ బాగాలేదు అని చెప్ప‌క‌నే చెప్పింది ఎన్టీఆర్ యాంక‌రింగ్ అదుర్స్  అందుకే ఐఫోన్ తో పోల్చింది..నానిపై ఆమె చేసిన ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి..
 
అయితే ఇదే విష‌యాన్ని ఓ నెటిజ‌న్ సంజ‌న ఇలా అందని, నానికి ట్వీట్ చేశాడు.. దీనిపై నాని చాలా సాఫ్ట్ గా స‌మాధానం ఇచ్చాడు.. నాకు ఐఫోన్ అంటే ఇష్టం అని ట్వీట్ చేశాడు...మొత్తానికి నాని ట్వీట్ కు కూడా నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.. విమ‌ర్శ‌ల‌ను కూడా చాలా లైట్ గా తీసుకున్నాడు అని కామెంట్లు రీ ట్వీట్స్ పెడుతున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.