ద‌ర్శ‌కుడు లేకుండా సినిమా ఇంట్ర‌స్టింగ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero sharwanandh image
Updated:  2018-03-07 01:12:40

ద‌ర్శ‌కుడు లేకుండా సినిమా ఇంట్ర‌స్టింగ్

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సైడ్ క్యారెక్టర్  తో ప‌రిచ‌యమై ఆ త‌ర్వాత చిన్న డైరెక్ట‌ర్లు తెర‌కెక్కించ‌బోయే చిత్రాల‌కు హీరోగా న‌టిస్తోంటారు శ‌ర్వానంద్... తాను న‌టించబోయే చిత్రాలు ఎక్కువగా  ఫ్యామిలీ  బ్యాక్  గ్రైండ్  సినిమాల‌ను ఎంచుకుంటూ ప్ర‌స్తుతం వ‌రుస సినిమా ఆఫ‌ర్స్ ను ద‌క్కించు కుంటున్నారు శ‌ర్వానంద్.... కాగా ఇప్ప‌టికే శ‌ర్వానంద్  శ‌త‌మానంభ‌వ‌తి, ఎక్స్ ప్రెస్ రాజా, రాధా వంటి చిత్రాల్లో హీరోగా న‌టించారు... అయితే ప్ర‌స్తుతం పడిప‌డి లేచే సినిమాలో న‌టించ‌నున్నాడు... దీంతోపాటు సుదీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాను చేయ‌నున్నాడు శ‌ర్వానంద్... 
 
ఈ రెండు సినిమా షూటింగ్ పూర్తి అయిన త‌ర్వాత ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్ పై మ‌రో చిత్రం చేయ‌బోతున్నాన‌ని గ‌తంలో శ‌ర్వానంద్ ప్ర‌కటించిన సంగ‌తి తెలిసిందే... కానీ ద‌ర్శ‌కుడు మాత్రం ఇంత‌వ‌ర‌కు ఫిక్స్ కాలేదు... నిజానికి ఈ బ్యాన‌ర్ పై తెర‌కెక్కించే చిత్రానికి శ్రీనివాస రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాలి...కానీ ఈ సినిమాకు సంబంధించిన క‌థ‌ను శ‌ర్వానంద్ ఓకే చేయ‌క పోవ‌డంతో ద‌ర్శ‌కుడి ప్లేస్ కాళీగానే వుంది... కాగా ద‌ర్శ‌కుడు లేకుండా ఈ బ్యాన‌ర్ పై న‌టించ‌డం ఇదే మొద‌టి సారిగా తెలుస్తోంది...
 
 శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కొత్త సినిమా రాబోతున్నట్టు ప్రకటించేశారు. ఈ ఏడాదిలోనే ప్రారంభం అవుతుందంటూ ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. కానీ దర్శకుడు ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారుతుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.