ఆ విష‌యం బ‌య‌ట‌ప‌డింది?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

mahanati savithri biopic
Updated:  2018-05-10 03:53:33

ఆ విష‌యం బ‌య‌ట‌ప‌డింది?

మ‌హాన‌టి సావిత్రి సినిమా ప‌రిశ్ర‌మ ఉన్నంత వ‌ర‌కూ నిలిచి ఉండిపోయే న‌టి అని చెప్ప‌వ‌చ్చు. ఆ మ‌హాన‌టి సావిత్రి జీవితం పై  బ‌యోపిక్  మ‌హాన‌టి విడుద‌లై మంచి పేరు సాధించింది. అందంతో పాటు అద్భుతమైన నటనతో విశేష ప్రజాదరణ సొంతం చేసుకున్నారు ఆమె.సావిత్రి అంటే ప్రేక్ష‌కుల‌కే కాదు అంద‌రికి ఇష్ట‌మే. వ్యక్తిగతంగా కూడా సావిత్రి అంటే ప్రేక్షకులకు ఎనలేని అభిమానం.
 
ఈ ఎవర్‌గ్రీన్ అందాల నటి జెమినీ గణేశన్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ప్రేమ పెళ్లి విష‌యం మాత్రం ఎవ‌రికి తెలియ‌నివ్వ‌లేదు. ఆమె పెళ్లి విష‌యం చాలా సీక్రెట్ గా ఉంచారు. అయితే దీనికి కార‌ణం ఆమె అప్ప‌టికే టాప్ హీరోయిన్ గా కొన‌సాగ‌డం అంటారు తెలిసిన‌వారు.
 
అయితే ఇప్పుడు తాజాగా ఆమె పెళ్లి  విష‌యంలో ఓ కొత్త విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆమెను అప్పుడు ప్ర‌ముఖ  కంపెనీ ల‌క్స్ సోప్ యాజ‌మాన్యం క‌లిశారు. త‌మ ప్రొడెక్ట్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉండాలని కోరారు. ఆమెను సెల‌క్ట్ చేసుకున్న త‌ర్వాత ఆ స‌మ‌యంలో కాంట్రాక్ట్ మీద సైన్ చేశారు ఆమె. ఆ స‌మ‌యంలో మ‌ర్చిపోయి అనుకోకుండా సావిత్రి గణేశన్ అని సైన్ చేశారట సావిత్రి. దీంతో ఆమె పెళ్లి విషయం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిందట ఇది ఇప్పుడు వైర‌ల్ అవుతున్న విష‌యం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.