రష్మీక పై చెత్త కామెంట్స్ చేసిన అభిమానులు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine rashmika
Updated:  2018-07-31 05:27:17

రష్మీక పై చెత్త కామెంట్స్ చేసిన అభిమానులు

కన్నడ హీరోయిన్ అయిన రష్మీక "ఛలో" సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తరువాత రష్మీక నటిస్తున్న సినిమా "గీత గోవిందం". విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 15 న రిలీస్ అవుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ ని దృష్టిలో పెట్టుకొని రష్మీక అభిమానులు ఇప్పుడు రష్మీకని తిడుతున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ లో రష్మీక విజయ్ దేవరకొండ వెనక ఎక్కి కూర్చుంటుంది. ఈ పోస్టర్ చూసాక చాలా మందికి వాళ్ళ మధ్య కెమిస్ట్రీ వర్క్ ఔట్ అయ్యింది అన్నట్టు అనిపించింది. కానీ కన్నడ రష్మీక అభిమానులు మాత్రం రష్మీక పై ఫైర్ అవుతున్నారు. ఆల్రెడీ కన్నడ హీరో అయిన రక్షిత్ శెట్టి తో పెళ్లి ఫిక్స్ అయ్యాక కూడా ఇలా ఎందుకు నటిస్తున్నావ్ అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు.

అలాగే తెలుగు కి వెళ్ళాక కన్నడని పూర్తిగా మర్చిపోయావ్ అయిన నిన్ను మేము ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాము అని కూడా అంటున్నారు. ఈ కామెంట్స్ కి  రష్మీక కొంచెం ఫీల్ అయిన గాని తరువాత స్పందిస్తూ పెళ్ళైన హీరోలు ఎలాగైనా నటించొచ్చు కానీ హీరోయిన్లు మాత్రం అలా నటించకూడదు ఎందుకు అంటూ తిరిగి సీరియస్ అయ్యింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.