అందుకే అలాంటి సినిమాలు ఒప్పుకున్నా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

shakeela movies
Updated:  2018-04-04 04:53:40

అందుకే అలాంటి సినిమాలు ఒప్పుకున్నా

షకీలా అనేపేరు వినిపించ‌గానే అంద‌రికి గుర్తువ‌చ్చేది శృంగార పాత్ర‌లే, ఆమెకు ఆ సినిమాలు ఎంతో గుర్తింపునిచ్చాయి వాటితో ఫేమ‌స్ అయ్యారు ష‌కీలా.. అయితే ఈ శృంగార చిత్రాల‌పై ప‌లు కామెంట్లు చేశారు ఆమె..తన మీద పడిన శృంగార తార ముద్ర అంటే తనకు అస్సలు ఇష్టం లేదంటోంది షకీలా.. త‌న‌కు ఇలాంటి సినిమాలు చేయాలి అని ముందు నుంచీ లేదు, కాని దుర‌దృష్టం కొద్ది ఈ సినిమాలు చేయడం జ‌రిగింది అని ఆమె తెలిపారు.. నాకు ద‌క్కిన పాత్ర‌లు కూడా ఇవే అని ఆమె బాధ‌పడ్డారు.
 
తన పొట్ట, కుటుంబ సభ్యుల పొట్ట నింపుకోవడం కోసమే తను అలాంటి సినిమాలు ఒప్పుకోవలసి వచ్చిందని షకీలా అన్నారు.... తన సినిమాలలో దృశ్యాల కన్నా ఘోరమైన దృశ్యాలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమవుతుంటాయనీ, వాటిని తప్పు పట్టరు కానీ, తనను ఎందుకు తప్పు పడతారో తనకు అర్థం కాదు అంటున్నారు ష‌కీలా.
 
మంచి మంచి పాత్రలు చేసి, మంచి పేరు తెచ్చుకోవాలనే కోరికతో ఈ రంగంలోకి వచ్చినా, తన ఆశయాలు, కోరికలు అన్నీ ఇక్కడ మాడి మసి అయిపోయాయనీ, తప్పని పరిస్థితులలో వచ్చిన సినిమాలు ఒప్పుకోవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు... సినీ ఇండ‌స్ట్రీలో చాలా మంది అనేక ఆశ‌లు పెట్టుకువ‌స్తారు కాని ఆ ఆశ‌లు కొంద‌రికి నెర‌వేరుతాయి అనేది తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.