సాయి పల్లవితో గొడవ పెట్టుకున్న శర్వానంద్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sai pallavi and sharwanand
Updated:  2018-07-25 11:15:27

సాయి పల్లవితో గొడవ పెట్టుకున్న శర్వానంద్

శర్వానంద్ ఇంకా సాయి పల్లవి వీరిద్దరూ జంటగా "పడి పడి లేచే అనే మనసులో" నటిస్తున్నారు. హను రాఘవాపుడి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ లో సాయి పల్లవి ఇంకా శర్వానంద్ గొడవ పడ్డారు అని తెలుస్తుంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఈ మూవీ షూటింగ్ సమయంలో సాయి పల్లవి బాగానే ఉన్నప్పటికీ షాట్ అయిపోవడమే ఆలస్యం తనకేమి పట్టనట్లు ఓ బుక్ తీసుకొని దూరంగా వెళ్లి ఒంటరిగా కూర్చుంటూ ఎవరు పిలిచినా రాకుండా, షాట్ కు షాట్ కు టీం ని ఇబ్బంది పడేలా చేస్తుందట.

దాంతో శర్వానంద్ కి కోపం వచ్చి ముఖం మీదే అడిగాడట, కానీ ఆమె మాత్రం ఎక్కడా తగ్గకుండా అలానే సమాధానం ఇస్తోందట. ఇదివరకు కూడా ఇలాగే "కణం" సినిమా షూటింగ్ టైంలో నాగ శౌర్య తో కలిసి గొడవ పెట్టుకుంది ఈ భామ.

ఆ సినిమా షూటింగ్ లోనే నాగశౌర్య ని సాయి పల్లవి ఇబ్బంది పెట్టిందని , దాంతో నాగశౌర్య అవమానంగా ఫీలయ్యాడని కథనాలు వచ్చాయి. అలాగే ప్రొడ్యూసర్ దిల్ రాజు ని కూడా డేట్స్ విషయం లో తన వైపు తిప్పించుకుంది సాయి పల్లవి. ఇంకొన్ని రోజులు ఈమె ఇలాగే ఉంటే ఇక తెలుగు ఈ భామకి సినిమాలు రావడం కష్టమే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.