ప్ర‌భాస్ తో ఎయిర్టెల్ భామ‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

prabhas
Updated:  2018-10-09 05:36:31

ప్ర‌భాస్ తో ఎయిర్టెల్ భామ‌

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి1, 2 చిత్రంలో హీరోగా న‌టించి ప్ర‌పంచ వ్యాప్తంగా త‌న‌కంటూ ఒక ఇమేజ్ ను క్రీయేట్ చేసుకున్నాడు రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. ఈ సినిమా త‌ర్వాత అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం సాహో...
 
ఈ చిత్రంలో ప్ర‌భాస్ కు జంట‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్ర‌ద్దాక‌పూర్ న‌టిస్తుంది. అయితే ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి ముఖ్య‌మైన పార్ట్స్ ను చిత్రం బృందం షూట్ చేసుకుని ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో కొన్ని పాత్ర‌ల‌ను చిత్రీక‌ర‌ణ జ‌రుపుతుంది
 
భారీ ప్రాజెక్ట్ తో తెర‌కెక్కుతున్న సాహో చిత్రం తెలుగు, హిందీ, త‌మిళం వంటి భాషల్లో విడుద‌ల‌కానుంది.. ఈ చిత్రంలో ప్ర‌భాస్ కు జోడీగా శ్ర‌ద్దాక‌పూర్ తో పాటు మందిరా బేడి, నీల్ నితిన్, ముకేశ్, ఎల్ విన్ వ‌ర్మ‌, జాకీ ష్రాఫ్, వంటి న‌టులు కీల‌క త‌ర‌హాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్ర‌కి సంబంధించి మ‌రో వార్త సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 
 
వీరంద‌రితో పాటు భార‌తీయ ఎయిర్టెల్ దిగ్గ‌జం యాడ్స్ సంస్థ‌లో ప‌నిచేసిన షాషా ఛైత్రీ కూడా న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్ అనే చిత్రంలో న‌టిస్తుంది. షాషా సాహోచిత్రంలో న‌టించే అవ‌కాశం వ‌చ్చిందంటే  ఇది గోల్డెన్ ఛాన్స్ అని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.  ఇక ఈ వార్త నిజ‌మో కాదో తెలియాలంటే మ‌రో ఏడాది ప‌ట్ట‌నుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.