అరవింద సమేత టీం కు షాక్ ఇచ్చిన థమన్ సెకండ్ సాంగ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

aravinda sametha
Updated:  2018-09-20 01:25:15

అరవింద సమేత టీం కు షాక్ ఇచ్చిన థమన్ సెకండ్ సాంగ్

మొదటిపాటతో అందరిని మెప్పించిన థమన్ ఇప్పుడు రెండవ పాట విడుదల చేసి తప్పు చేశాడా అనిపిస్తుంది. “అరవింద సమేత” సెకండ్ ట్రాక్ నిన్న రిలీస్ అయ్యి భిన్నాభిప్రాయాలను మూటగట్టుకుంది. మొదటిపాటతో థమన్ మారిపోయాడు అనుకున్నవారంతా రెండవ సాంగ్ విని ఆబ్బె ఎక్కడ మారాడు మారలేదు అని అనుకుంటున్నారు. 
 
పెనివిటి అంటూ సాగే ఈ పాట బాగా మనసుని కదిలించే సాహిత్యంతో వచ్చింది. రామ జోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ అందించాడు. ఎప్పటిలాగే అద్భుతమైన పదాలు రాశాడు. కాలభైరవ కూడా చాలా ఈజ్ తో పాటని పాడాడు. అయితే ట్యూన్ దగ్గరే అందరు అసంతృప్తిగా ఉన్నారు. 
 
పాట విన్న తర్వాత ఈ పాట ఎక్కడో  విన్నట్లు అనిపిస్తుంది. తీరా పట్టి పట్టి చూస్తే బ్రూస్లీ సినిమాలోని కుంగ్ ఫూ కుమారి పాటను స్లో చేసి వీర సినిమాలోని ఓసి నీ చిట్టి సాంగ్ కాస్త కలిపేస్తే ఇప్పుడు విడుదలైన అరవింద సమేత పాటలా ఉందని సామజిక మాధ్యమాలలో కామెంట్స్ పెడుతున్నారు. ఈ పాట విన్న త‌ర్వాత థ‌మ‌న్ ఇంకా మార‌లేదు అని అర్థ‌మైపోతుంది.ఇప్పుడు మిగిలిన రెండు పాట‌లు ఎలా ఉండ‌బోతున్నాయో అనే ఆవేదన అభిమానుల్లో మొద‌లైపోయింది. సెప్టెంబ‌ర్ 20న పూర్తి ఆల్బ‌మ్ విడుద‌ల కానుంది. ఇందులో ఇంకా దారిచూడు ఫేమ్ పంచెల్ దాస్ పాడిన ఏడ పోయినాడో.. సీమ యాస‌లో సాగే రెడ్డి అక్క‌డ సూడు పాట‌లు కూడా విడుద‌ల కానున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.