స‌ల్మాన్ కు ఊహించ‌ని షాక్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-12 06:24:45

స‌ల్మాన్ కు ఊహించ‌ని షాక్

బాలీవుడ్ స్టార్‌హీరో  స‌ల్మాన్ ఖాన్‌కు దేశ వ్యాప్తంగా  ఆద‌ర‌ణ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంద‌రికీ తెలుసు. వ‌రుస విజ‌యాలు సాధిస్తూ.. బాలీవుడ్ టౌన్‌లో అగ్ర‌స్థానాన్ని కైవ‌సం చేసుకున్నాడు ఈ కండ‌ల వీరుడు. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న‌సినీ న‌టులు త‌మ‌దైన శైలిలో జీవ‌నం సాగిస్తుంటారు. స‌హ‌జంగా సినీ హీరోలు గుర్రాల‌ను అమితంగా ఇష్ట‌ప‌డుతుంటారు.  
 
స‌ల్మాన్‌ఖాన్ కూడా ఈ కోవ‌కు చెందిన వారే. ఆయ‌న ఫాంహౌస్‌లో  ఇప్ప‌టికే చాలా గుర్రాలు ఉన్నాయి. కాని ఈ అగ్ర హీరో
అత్యంత మేలు రకమైన సఖిబ్‌ జాతికి చెందిన గుర్రాన్ని కొనాలనుకున్నారు. ఈ జాతి గుర్రాలు ప్ర‌పంచంలో చాలా అరుదుగా క‌నిపిస్తాయి. అహ్మదాబాద్‌కు చెందిన సిరజ్‌ ఖాన్‌‌ అనే వ్యక్తి అ ర‌క‌మైన గుర్రాన్ని పెంచుతున్నారు. గంటకు 43 కిలోమీటర్ల వేగంతో పరుగెత్త‌డం దీని ప్ర‌త్య‌క‌త‌. ఈ గుర్రాన్ని సిరజ్‌ రాజస్థాన్‌ సంతలో కొన్నారు.
 
స‌ల్మాన్‌ అ గుర్రానికి 2కోట్లు ఆఫ‌ర్ చేసిన య‌జ‌మాని తిర‌స్క‌రించార‌ట‌. గుర్రాలు పెంచుకునే సామాన్యుడు హీరో స‌ల్మాన్‌ను తిర‌స్క‌రించిన విష‌యం...ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో హ‌ట్ టాఫిక్ అయింది. సఖిబ్‌ జాతి గుర్రాన్ని సోంతం చేసుకోవ‌డానికి  పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ కూడా  ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. సిరజ్‌కు ఆయన రూ.1.11 కోట్లు ఆఫర్‌ చేసినట్లు చెబుతున్నారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.