ఆ సీన్లు చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డా ... శ్రీయ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

shriya saran
Updated:  2018-10-23 02:59:44

ఆ సీన్లు చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డా ... శ్రీయ

దక్షిణాది అగ్ర హీరోల సరసన నటించడం మొదలుకొని, వేశ్యగా సైతం ఫిమేల్ ఓరియెంటెడ్ రోల్స్ లో సైతం తనదైన ముద్ర వేసిన నటి శ్రీయ శరణ్. ఈ మధ్యనే పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే పెళ్లి అయ్యాక శ్రీమతి గా రిలీస్ కానున్న చిత్రం వీరభోగ వసంతరాయల.

ఈ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించింది శ్రియ. ఈ చిత్రంలో నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీవిష్ణులు ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. శ్రీయ లుక్ ఏ చాలా డిఫరెంట్ గా ఉండడంతో, సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి.. ఈ సినిమా కి సంబందించిన ఇంటర్వ్యూలో ఈ సినిమాలో తన పాత్ర వైవిధ్యభరితం గా ఉండబోతుంది అని, దింట్లో ఆల్కహాల్, సిగెరెట్ తాగే పాత్ర చేసా అని చెప్పుకొచ్చింది. ఈ సీన్లు చేసే టైం లో గది మొత్తం సిగెరెట్ పొగ తో నిండిపోయింది అని, దానికి చిత్ర యూనిట్ మరియు శ్రీయ ఇబ్బంది పడ్డారని ఇంటర్వ్యూలో పేర్కొంది.

ఇలాంటి సీన్స్ చేయడం చాలా కష్టంగా అనిపించినప్పటికీ సినిమా ఫలితం చూసి అవన్నీ మరిచిపోతానని చెప్పింది. ఫలితం మాటకి వస్తే సినిమా రిలీస్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటికే ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

 

షేర్ :