"సిల్లీ ఫెల్లోస్" విడుదల తేదీ ఖరారు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

silly fellows
Updated:  2018-08-09 04:41:01

"సిల్లీ ఫెల్లోస్" విడుదల తేదీ ఖరారు

అల్లరి నరేష్, సునీల్ కధానాయకులుగా భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రుపొందుంతున్న చిత్రం "సిల్లీ ఫెలోస్". ప్రస్తుతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. అయితే ఈ చిత్ర విడుదల తేదీని సెప్టెంబర్ 7వ తారీఖున ఖరారు చేసింది చిత్రబృందం.

గుడ్ విల్ సినిమా పతాకంపై భీమినేని శ్రీనివాసరావు స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిత్ర శుక్ల, నందిని రాయ్ లు హీరోయిన్ గా నటిస్తున్నారు. 2012లో భీమినేని శ్రీనివాసరావు, “అల్లరి”నరేష్ కాంబినేషన్ లో వచ్చిన “సుడిగాడు” చిత్రం “అల్లరి”నరేష్ కెరీర్ లోనే అత్యంత భారీ హిట్ గా నిలిచింది.

అయితే ఆ చిత్రం నుంచి ఇప్పటివరకు నరేష్ చేసిన సినిమాలేవీ “సుడిగాడు”స్థాయి విజయాన్ని అందుకోలేకపోవడంతో “అల్లరి”నరేష్ కెరీర్ కి ఈ చిత్రం కీలకంగా మారనుంది. అలాగే హీరోగా ఘోరమైన ప్లాప్స్ ని చవిచూసిన సునీల్ కూడా ఈ చిత్రంతో మళ్ళీ తన బలమైన కామెడీని నమ్ముకుంటున్నాడు. మరి వీరిద్దరి ఆశలను “ఫన్ రాజా ఫన్” ఏ మేరకు అందుకుంటుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాలి.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.