రజనీకాంత్‌ కి విలన్ గా మారిన సిమ్రాన్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

rajinikanth and simran
Updated:  2018-07-30 04:50:50

రజనీకాంత్‌ కి విలన్ గా మారిన సిమ్రాన్

తమిళ హీరోయిన్ అయిన సిమ్రాన్ కి తెలుగు లో కూడా మంచి స్టార్ స్టేటస్ ఉంది. పెళ్లి తరువాత సిమ్రాన్ తెలుగు సినిమాలకి దూరంగా ఉంటుంది. ప్రస్తుతం సిమ్రాన్ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చెయ్యడమే సూపర్ స్టార్ రజనీకాంత్‌ తో కలిసి నటిస్తుంది సిమ్రాన్.

దాదాపు సీనియర్‌ స్టార్‌ హీరోలందరితోనూ నటించిన సిమ్రాన్‌, ఒక్క రజనీకాంత్‌తోనే నటించలేదు. ఆ కోరిక సెకండ్‌ ఇన్నింగ్స్‌లో నెరవేరబోతున్నందుకు సిమ్రాన్‌ తెగ సంతోషపడిపోతోందట. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రజనీకాంత్‌ లేటెస్ట్ సినిమాలో సిమ్రాన్‌ ఒక ముఖ్యపాత్రలో నటిస్తుంది.

ఈ సినిమాలో సిమ్రాన్ ది విలన్ క్యారెక్టర్ అంట. పూర్తీ స్థాయి నెగటివ్ షేడ్స్ తో ఈ క్యారెక్టర్ ని రాసుకున్నాడు అంట కార్తీక్ సుబ్బరాజ్. సినిమా కథకి ఈ పాత్ర చాలా కీలకం అంట. ఇదిలా ఉంటే ఇదే సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అయిన నవజుద్దిన్ సిద్దికి కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాని హై టెక్నికల్ వాల్యూస్ తో ప్రొడ్యూస్ చేస్తుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.