నేను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను... ‍సింగర్ చిన్మయి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

singer chinmayi
Updated:  2018-10-08 11:48:42

నేను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను... ‍సింగర్ చిన్మయి

గతకొంతకాలంగా లైంగిక వేధింపుల గురించి పలువురు మహిళలు, హీరోయిన్ లు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తాను ఎదుర్కొన్న లైంగికదాడులు గురించి చెప్పింది చిన్మయి..చిన్మయికి 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అలాగే పదేళ్ళ వయసు ఉన్నప్పుడు, తాను కూడా లైంగిక దాడికి గురి అయ్యాను అని,సమాజంలో చాలా మంది పెద్దమనుషులు ముసుగులో వెధవ వేషాలు వేస్తున్నారు అని, అలాంటి వాళ్ల చేతుల్లోనే తాను కూడా లైంగికంగా వేధింపబడ్డా అని చెప్పింది చిన్మయి..

మహిళలకు సమాజంలో రక్షణ లేకుండా పోయిందని , చిన్న వయసులోనే వాళ్ళు లైంగిక వేధింపులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది చిన్మయి. సినిమారంగంలో కూడా పలువురు పెద్ద మనుషుల్లా వ్యవహరిస్తుంటారని కానీ వాళ్ళు మంచి అనే ముసుగులో చలామణి అవుతున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేసింది.. సింగర్ గా, సమంత కు డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ గా చిన్మయి కి మంచి గుర్తింపు ఉంది..

ఈ తరుణం లో ఇండస్ట్రీ వల్ల కోసం చిన్మయి చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారాయి.. అయితే చిన్మయి మాత్రం వారి పేర్లు బయట కి చెప్పలేదు..ఇక పై ఆడవాళ్ళు ఇలాంటి సమస్యలు ఎదురైతే చెప్పుతో సమాధానం చెప్పాలంటూ, తనని ఎవరైనా ఇలా లైంగికంగా వేధిస్తే, అది ఇండస్ట్రీ వాళ్ళు అయినా చెప్పుతోనే సమాధానం చెప్తాను అంది చిన్మయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.