వారికి రెండే రోజులు గడువు ఇచ్చిన గీత మాధు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

singer geetha madhuri
Updated:  2018-10-16 01:04:52

వారికి రెండే రోజులు గడువు ఇచ్చిన గీత మాధు

తెలుగు సింగర్ గా గీత మాధురి కి ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంది. బిగ్ బాస్ షో తో బోలెడంత పెరు వస్తుందనే ఆశతో సీజన్ 2 లో కాంటెస్టెంట్ గా వెళ్లింది. ఈమెకున్న ఫాలోయింగ్ తో రన్నర్ అప్ కూడా అయింది. కానీ గీత కి బిగ్ బాస్ అంత మంచి చేసినట్టు అయితే కనపడట్లేదు. ఎందుకంటే ఇన్నాళ్లు తాము అనుకున్న గీతామాధురి బిగ్ బాస్ హౌస్ లో వేరేలా కనిపిస్తుందని ఆమె అభిమానులు కొందరు సోషల్ మీడియాలో వాపోతున్న సంగతి తెలిసిందే.
 
గీత ఎన్ని సార్లు తాను తనలానే ఉన్నానని చెప్పినా పరిస్థితులు మాత్రం అలా లేవు. బిగ్ బాస్ లో ఆమె ప్రవర్తనను తప్పుబడుతూ కొందరు సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్ లో ఇష్టం వచ్చినట్లు ఆమెపై కథనాలు పబ్లిష్ చేస్తున్నారు.
 
ఇవన్నీ చూసి విసుగెత్తిన గీత మాధురి వారిపై చాలా సీరియస్ అవుతోంది. తనను కించపర్చే విధంగా ఉన్న వీడియోలను వెంటనే తొలగించాలని, వారికి తాను రెండు రోజులు సమయం ఇస్తున్నట్టు, ఒకవేళ వాళ్లు ఆ వీడియోలు తీసేయ్యకపోతే ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై లీగల్ యాక్షన్ కు సిద్ద పడుతున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
 
గీతా మాధురి హెచ్చరిక చూసి ఆ యూట్యూబ్ ఛానెల్స్ వారు ఆ వీడియోలను తొలగిస్తారా లేదంటే గీతా మాధురితో న్యాయపోరాటం చేస్తారా అనేది ఆసక్తిగా మారింది. ఇక ఫ్యాన్స్ కూడా ఆ యూట్యూబ్ చానెల్స్ పై ఫైర్ అవుతూ, వీడియోలు